బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్ యూజర్‌లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ‘బ్యాటరీ బ్యాకప్'. ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ బ్యాటరీ పనితీరు పై ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంది. తన ఫోన్‌లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని సరఫరా చేస్తుంది, అందులో ఏది వృధాగా ఖర్చవుతుందనే వివరాలను యూజర్ తన స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పై తెలసుకోవచ్చు. తద్వారా బ్యాటరీ శక్తిని పొదుపుచేసుకోవచ్చు. ఆ విధానం ఏలాగో చూద్దాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లయితే..?

మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ దిగువ భాగాన ఉన్న మెనూ బటన్‌ను క్లిక్ చేయండి.
అనంతరం సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లండి.
"About Phone" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
బ్యాటరీ యూసేజ్ అనే లావాదేవీ పై క్లిక్ చేస్తే బ్యాటరీ వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా...?, బ్యాటరీ శక్తిని పొదుపు చేసుకునే మార్గాల కోసం ఆన్వేషిస్తున్నారా..?, ఇవిగోండి బ్యాటర్ బ్యాకప్‌ను పొదుపుచేసుకునే విలువైన మార్గాలు.......

పవర్ కంట్రోల్ అప్లికేషన్:  కొద్ది పాటి చోటను ఆక్రమించే ఈ అప్లికేషన్ హోమ్‌స్ర్కీన్ విడ్జెట్‌లాగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ అవసరంలేని సమయాల్లో వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను ఆఫ్ చేస్తుంది. అంతేకాదండోయ్ మీ స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను సైతం అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరుగుతుంది.

ఫైన్-ట్యూన్ స్ర్కీన్ బ్రైట్‌నెస్: స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీని మరింత ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్టి డిస్‌ప్లే ఐకాన్‌ను ఎంపిక చేసి బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటే సరిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot