హైదరాబాద్‌లో గాడ్జెట్ షాపింగ్ ఏలా..?

Posted By:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగానే కాకుండా ఐటీ ఇంకా పర్యాటక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు‌ను మూటగట్టుకున్న హైదరాబాద్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్త్తోంది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. సాంకేతిక పరికరాల మార్కెట్ భాగ్యనగరంలో ఆపారంగా విస్తరించింది. రిలయన్స్ డిజిటల్.. క్రోమా.. బిగ్ సీ.. యూనివర్ సెల్.. గాడ్జెట్ స్టోర్ వంటి ప్రత్యేక గాడ్జట్ షోరూమ్‌లు సాంకేతిక పరికరాలను నగర వాసులకు అందిస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 హైదరాబాద్‌లో గాడ్జెట్ షాపింగ్ ఏలా..?

మొబైల్ ఫోన్‌ల వ్యాపారంలో భాగంగా హైదరాబాద్‌లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్ మినీసెల్ వరల్డ్‌గా ప్రసిద్దికెక్కింది. ఈ మార్కెట్లో దొరకని ఫోన్ అంటూ ఉండదు. అన్నిరకాల సెల్‌ఫోన్‌లకు సంబంధించి సేల్స్ ఇంకా సర్వీసింగ్ ఇక్కడ జరుగుతుంది. చైనా ఫోన్లు మొదలుకుని ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ ఫోన్‌ల వరకు సకలం లభ్యమవుతాయి. దాదాపు ఈ మార్కెట్లో 200కు పైగా గ్యాడ్జెట్‌లను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. నకిలీ సెల్‌ఫోన్‌లకు ఈ మార్కెట్ అడ్డా. వినియోగదారులకు టోకరా వేస్తూ బ్రాండెడ్ కాని సెల్‌ఫోన్‌లను ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్లో సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారు ఆచితూచి స్పందించటం అవసరం. ఏమాత్రం ఆశ్రద్ద వహించినా పెద్ద ఎత్తున టోకరా తప్పదు.

యూనివర్ సెల్.. ఈ మొబైల్ రిటైల్ షోరూమ్‌కు రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. సాధారణ మొబైల్ ఫోన్‌లు మొదులకుని అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఇక్కడ లభ్యమవుతాయి. అమీర్‌పేట్, దిల్‌షుఖ్ నగర్, కాచిగూడ, హుమాయన్ నగర్, సంతోష్ నగర్, వనస్తలిపురం, హిమాయుత్ నగర్, మలక్‌పేట్, యూసఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో యూనివర సెల్ అవుట్లెట్‌లు ఉన్నాయి.

బిగ్‌సీకి రాష్ట్ర వ్యాప్తంగా పలు అవుట్‌లెట్‌లు ఉన్నాయి. గ్లోబల్ ఇంకా దేశవాళీ కంపెనీల మొబైల్ ఫోన్‌లు ఇక్కడ లభ్యమవుతాయి. సర్వీసెంగ్ సేవలను బిగ్‌సీ అందిస్తుంది. సోమాజి‌గూడ, మాదాపూర్, కుకట్‌పల్లి, తిరుమలగిరి, హుమాయున్ నగర్, ఎస్ఆర్ నగర్, మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో బీగ్‌సీ షోరూమ్‌లు ఉన్నాయి.

రిలయన్స్ డిజిటల్.. ఇక్కడ దొరకని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులంటూ ఉండవు. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని మ్యూజిక్ ప్లేయర్‌ల వరకు డిస్కౌంట్ ధరల్లో ఇక్కడ లభ్యమవుతాయి. బంజారా హిల్స్, మలక్ పేట్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో రిలయన్స్ డిజిటల్ షోరూమ్‌లు ఉన్నాయి.

గాడ్జెట్ స్టోర్.. ఈ మొబైల్ విక్రయాల స్టోర్ బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఉంది. నోకియా, సామ్‌సంగ్, యాపిల్, బ్లాక్‌బెర్రీ ఇంకా మైక్రోమ్యాక్స్ ఫోన్‌లు ఇక్కడ లభ్యమవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot