మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొందరికి మాత్రమే చేరాలంటే..?

Posted By:

మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొంతమందికి మాత్రమే చేరాలా..? అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. ఆ విధానం ఏలాగో మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.....

మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొందరికి మాత్రమే చేరాలంటే..?


మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే వెళ్లాలనుకుంటే ముందుగా ఆ పోస్టుకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తరువాతి చర్యగా ప్రైవసీ సెట్టింగ్స్‌లోని పబ్లిక్ లేదా ఫ్రెండ్స్ ఆప్సన్‌ను ఎంపిక చేసుకున్న తరువాత ‘కస్టమ్' ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు కస్టమ్ ప్రైవసీ బాక్స్ ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు మీరు హైడ్ చేయాలనుకుంటున్న వారి అకౌంట్‌ల పేర్లను ‘డోంట్ షేర్ దిస్ విత్' బాక్స్‌లో ఉన్నఖాళీలో టైప్ చేసి క్రింది ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీరు హైడ్ చేయాలనుకుంటున్న అకౌంట్‌ల వివరాలను సదరు బాక్స్‌లో జత చేసిన వెంటనే "Save changes" పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన పోస్ట్ ఎవరికైతే పంపాలనుకున్నారో వారికి మాత్రమే చేరుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot