కంప్యూటర్ సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు చిట్కాలు!!

చాలామంది కంప్యూటర్ వినియోగదారులకు తమ పీసీ సామర్ద్యం ఎంతో తెలియదు. కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ పీసీ కాన్ఫిగరేషన్‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్‌లకు సంబంధించి పూర్తి వివరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ పనితీరు ముఖ్యంగా ఈ మూడు విభాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, ర్యామ్ వివరాలు తెలుసుకోవాలంటే ‘మై కంప్యూటర్' పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసిగాని, ‘కంట్రోల్ పేనల్'లోకి లాగినై గాని తెలుసుకోవచ్చు. హార్డ్‌డిస్క్ వివరాలు కావాలంటే మై కంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్‌డిస్క్ ఐకాన్ల పై రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది.
హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...
ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications