స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

|
స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

సిమ్ కార్డ్... పరిమాణంలో కాస్తంత చిన్నగా కనిపించినప్పటికి మొబైల్ ఫోన్‌కు ప్రాణం లాంటిది. స్మార్ట్ మొబైలింగ్ అందుబాటులోకి వచ్చేసిన నేపధ్యంలో స్టాండర్డ్ సిమ్ కార్డులు కాస్తా మైక్రో సిమ్ కార్డులుగా మారిపోతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో స్టాండర్డ్, మైక్ర్, నానో ఫార్మాట్‌లలో మూడు రకాల సిమ్ కార్డులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఇంటర్నెట్ వినియోగంతో పాటు ప్రీ-లోడెడ్ డేటాను కలిగి ఉంటున్నాయి. గత మోడల్ సిమ్ కార్డులు కేవలం 16 కేబీ డేటాను మాత్రమే కలిగి ఉండేవి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిమ్ కార్డులు 32 కేబీ డేటాను కలిగి ఉంటున్నాయి. మైక్రోసిమ్ కార్డ్‌లతో పోలిస్తే నానో సిమ్‌లు 30శాతం చిన్నవిగా, 15శాతం పలుచగా ఉంటాయి.

 
స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

తాజాగా విడుదలైన అనేక మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు మైక్రోసిమ్ స్లాట్‌లను కలిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమ పాత మొబైల్ ఫోన్‌ల స్థానంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్న వారికి సిమ్‌స్లాట్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణ సిమ్‌కార్డ్ స్లాట్‌తో పోలిస్తే మైక్రోసిమ్ స్లాట్ తక్కువ పరిమాణాన్ని కలిగి ఉండటంతో సాధారణ సిమ్ కార్డును కలిగి ఉంటున్న వినియోగదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

సాధారణ సిమ్‌కార్డ్‌ను, మైక్రోసిమ్ కార్డుగా మలచటం పెద్ద కష్టతరమైన విషయమేమికాదు. సిమ్ కార్డును, మైక్రోసిమ్ కార్డుగా మలిచే సిమ్‌కట్టర్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటి ద్వారా స్టాండర్డ్ సిమ్‌ను మైక్రో సిమ్‌గా మలచుకోవచ్చు. స్టాప్‌లర్ డిజైన్‌ను పోలి‌ఉండే ఈ సిమ్ కట్టర్‌ సాధారణ సిమ్‌ను మైక్రో సిమ్‌గా కట్ చేస్తుంది. కత్తిరింపు గురైన భాగాన్ని భద్రపరుచుకని సంబంధిత సిమ్‌ను వేరొక సాధారణ సిమ్‌స్లాట్ కలిగిన మొబైల్‌లోకి మార్చుకున్న సందర్భంలో ఉపయోగించుకోవచ్చు.

స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లు మొదలుకుని డేటా కార్డుల వరకు సిమ్‌కార్డ్ ఆధారంగానే స్పందిస్తున్నాయి. ఇంత వరకు మనందరికి తెలుసు. అసలు సిమ్ కార్డ్ ఏమిటి..? ఈ ప్రశ్నకు జవాబు చాలా మందికి తెలుసి ఉండదు. సిమ్ కార్డ్ పూర్తి పేరు ‘సబ్‌స్ర్కైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్'. దీన్నే మనం క్లుపంగా సిమ్ కార్డ్‌గా పిలుచుకుంటున్నాం. సిమ్ కార్డ్‌లను ఒక్క మొబైల్ ఫోన్స్‌‍లోనే కాదు పేటీవీ, ఏటీఎం, ఇంటర్నెట్ డేటా‌కార్డ్స్ వగైరా అంశాల్లో ఉపయోగిస్తున్నారు. సిమ్ కార్డ్‌లలో రెండు రకలాంటాయి. వీటిలో మొదటి రకం సిమ్ కార్డులు రీడ్ ఓన్లీ మెమరీ వ్యవస్థను మాత్రమే కలిగి ఉంటాయి. రెండో రకం సిమ్ కార్డుల్లో మెమరీని చెరిపి మళ్లి రాసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల విషయానికొస్తే సిమ్ కార్డులు జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ రకాల్లో లభ్యమవుతున్నాయి. మార్కెట్లో మొబైల్ ఫోన్‌ సిమ్ కార్డులు 2జీ, 3జీ, 4జీ రకాల్లో లభ్యమవుతున్నాయి.

స్టాండర్డ్ సిమ్‌కార్డ్ పరిమాణం - 85mm x 53mm

మైక్రో సిమ్‌కార్డ్ పరిమాణం- 25mm x 15mm

నానో సిమ్‌కార్డ్ పరిమాణం-15mm x 12mm

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X