పీసీలో విండోస్ 7 వాడుతున్నారా..? టాస్క్ బార్ వెరైటీగా

Posted By:

మీ వ్యక్తిగత కంప్యూటర్‌ను విండోస్ 7 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై రన్ చేస్తున్నారా..? స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే టాస్క్‌బార్‌ను తెర పై భాగానికి తీసుకురావాలనే ఆలోచన మీలో ఎప్పుడైనా కలిగిందా..? అలాంటి ఆలోచనే మీలో మెదులుతున్నట్లయితే ఈ సూచనలను పాటించి అనుకున్నది చేసేయండి. విండోస్ 7 పై రన్ అవుతున్న పీసీలో టాస్క్ బార్ స్థానాన్ని మార్చటం చాలా సులువు!.

పీసీలో విండోస్ 7 వాడుతున్నారా..? టాస్క్ బార్ వెరైటీగా

- ముందుగా స్ర్కీన్‌కు క్రింది భాగంలో నిక్షిప్తమై ఉన్న టాస్క్‌బార్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేయండి.

- మౌస్‌తో రైట్ క్లిక్ చేసిన వెంటనే పక్కనే ఓ మెనూ ప్రత్యక్షమవుతుంది.

- ఆ మెనూలోని ‘లాక్ ద టాస్క్‌బార్' (lock the taskbar) ఆప్షన్‌ని అన్‌చెక్ చేయండి.

- ఇప్పుడు టాస్క్‌బార్‌ను మౌస్‌తో నొక్కి ఉంచి కావల్సిన వైపుకు డ్రాగ్ చేసుకుని లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను అనుసరించి   టాస్క్‌బార్‌ను స్ర్కీన్‌కు నాలుగు వైపులా ఎటువైపు కావాలంటే అటు వైపుకు మార్చుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot