అనుకోకుండా విహార యాత్రను ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చూడవల్సిను ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఆ ప్రదేశాలను తిలకించటం కాస్తంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవటం ద్వారా విహారయాత్రను ఏ మాత్రం మిస్ nbsp;కాకుండా పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. విండోస్ పీసీ లేదా ల్యాప్ టాప్ ద్వారా మీ వద్ద ఉన్న ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లను ఉపయోగించుకుండా nbsp;డిజిటల్ క్యామ్ లేదా ఇంటర్నెట్ ద్వారా మీరు సేకరించిన ఫోటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవచ్చు. (ఇంకా చదవండి: వాట్సాప్ ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?) ముందుగా ఫోల్డర్ లో మీకు కావల్సిన ఫోటోలను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్ లు కనిపిస్తాయి. వాటిలో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్ లో మీ పీసీ లేదా ల్యాప్ టాప్ కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్ ను సెలక్ట్ nbsp;చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్ ను సెట్ చేసుకోవచ్చు. ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్ లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక పోటోనే కావాలా, లేకు రెండు ఫోటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫోటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్ లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్బ టన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫోటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.