వైరస్‌కు చెక్ పెట్టండిలా!!

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రతి ఇంటికి అనివార్యమైంది. ఈ నేపధ్యంలో అందరి ఇల్లలోనూ కంప్యూటర్లు ఉంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ‘వైరస్'. మరి అలాంటి చీడకు చెక్ పెట్టేందుకు పాటించివల్సిన ముఖ్యమైన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

వైరస్‌కు చెక్ పెట్టండిలా!!

మీ కంప్యూటర్‌ను సైబర్ క్రిమినల్స్ దాడుల నుంచి రక్షించేందుకు విశ్వసనీయతతో కూడి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి. గుర్తుతెలియన మెయిల్స్‌కు ఏ మాత్రం స్పందించకండి. ముఖ్యంగా EXE ఎక్స్‌టెన్ష‌‍న్‌తో ఎటాచ్‌మెంట్‌గా ఉన్న మెయిల్స్ మరింత ప్రమాదకరం. ఈ ఫైళ్ల ద్వారా వ్యాపించే వైరస్ కంప్యూటర్ పనితీరును పూర్తిగా దెబ్బతీస్తుంది.

పాస్‌వర్డ్‌ల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. మీ అకౌంట్ల లాగిన్‌లకు సంబంధించిన వివరాలను ఏ విధంగానే బహిర్గతం చేయకుండి. మీ పీసీలో స్టోర్ కాబడిన డేటాను ఎప్పటికప్పుడు సీడీలు ఇంకా ఇతర డ్రైవ్స్‌లోకి బ్యాకప్ చేసుకోండి. ఇంటర్నెట్‌ను వినియోగించని సమయంలో నెట్ కనెక్షన్‌ను ఆఫ్ చేయటం మంచిది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సమయంలో మరింత గోప్యత అవసరం. పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసే సమయంలో వర్చువల్ కీబోర్డ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot