పోయిన ఫోన్‌ను వెతికిపట్టుకునేందకు చిట్కాలు!
దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీ ఘటనలు తరచుగా నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు. అపహరణకు గరైన మొబైల్ ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను మీ ముందుంచుతున్నాం.

ఐఎమ్ఈఐ నెంబర్:
ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.
అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ:
ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించికుండా నివారించటమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యూప్ ఏర్పరుస్తుంది. ఈ యూప్‌లో పొందుపరిచిన యాంటీ-తెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది.
మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్:
ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్‌లను చేధించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదురు మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది.
తీఫ్ ట్రాకర్:
ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే తీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈ-మెయిల్‌కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు.
స్మార్ట్ లుక్:
ఈ సాఫ్ట్‌వేర్, మీ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను క్యాప్చర్ చేసి వెనువెంటనే మీ ఈ-మెయిల్‌కు చేరవేస్తుంది. అంతేకాదండోయ్ ఈ యూప్‌లో పొందుపరిచన కంటిన్యూస్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం గూగుల్ మ్యాప్ సాయంతో ఫోన్ ఆచూకీని చేధించగలదు.
యాంటీ-తెఫ్ట్ ఆలారమ్:
ఈ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోకి సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లోని ఆలారమ్ ఫీచర్‌ను ఆన్‌చేస్తే సరిపోతుంది. అపరిచిత వ్యక్తి మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసే ప్రయత్నం చేస్తే ఆలారమ్ మోగటం ప్రారంభిస్తుంది. పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారానే ఆలారమ్‌ను ఆఫ్ అవుతుంది.
కాస్పర్ స్కై మొబైల్ సెక్యూరిటీ :
ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు అన్ని విధాలుగా రక్షణ కవచంలా నిలుస్తుంది. యాంటీ-తెఫ్ట్, యాంటీ వైరస్, క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను యూప్‌లో నిక్షిప్తం చేశారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








