వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
70 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ అత్యుత్తమ మొబైల్ మెసేజింగ్ సర్వీస్‌గా అవతరించింది. తాజాగా ఈ సర్వీసుకు సంబంధించి పీసీ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్ కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాట్స్‌యాప్ వెబ్ వర్షన్ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్ మాత్రమే. యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.
అకౌంట్ కు సంబంధించి పూర్తి డేటా మొత్తం మొబైల్ వర్షన్‌లోనే ఉంటుంది. వాట్స్‌యాప్ వెబ్ వర్షన్‌ను పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగిన్ కావాలి. ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది. వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే అది సాధ్యమవుతుంది. వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి. ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే.వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.
వాట్సాప్ అకౌంట్ గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
యాప్‌ను రీఇన్‌స్టాల్ చేయకుండానే మీ వాట్సాప్ అకౌంట్‌లో నెంబర్‌ను మార్చేయవచ్చు.

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
మీ వాట్సాప్ అకౌంట్‌లోని సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా ఆటోమెటిక్ మీడియా ఫైల్ డౌన్‌లోడింగ్‌ను అడ్డుకోవచ్చు.

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకోవటం ద్వారా లాస్ట్‌సీన్ టైమ్‌స్టాంప్‌ను డిసేబుల్ చేసకోవచ్చు.

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
మీ వాట్సాప్ అకౌంట్‌ను లాక్ చేసుకునేందుకు వివిధ యాప్స్ ఇంటర్నెట్‌లో అందుబుటాలో ఉన్నాయి.

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
వాట్సాప్‌లోని ఆటో బ్యాకప్ ఫీచర్ సహాయంతో మీ చాటింగ్ హిస్టరీని భద్రపరుచుకోవచ్చు.

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. (ఈ అవకాశం ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది)

వాట్సాప్ గురించి ఇవి మీకు తెలుసా..?
మీ ప్రొఫైల్ ఫోటోను మీ వాట్సాప్ కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారు తప్ప వేరొకరు చూడకుండా ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications








