Home
News

ఒకే యాప్‌లో సినిమా, క్రికెట్, సీరియల్స్ అన్నీ.. కొత్త "జియోహాట్‌స్టార్" ప్రత్యేకతలు తెలిస్తే ఫిదా అవుతారంతే.

JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలో 'జియోహాట్‌స్టార్ (JioHotstar)' పేరిట కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకొస్తామని వెల్లడించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండూ కలిస్తే వచ్చే ప్లాట్‌ఫామ్ అన్నమాట. \"స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం\" అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో టీజర్ కూడా వదిలారు. ఇకపై ఈ రెండింటిలోని కంటెంట్ అంతా ఒకే యాప్‌లో చూసేయొచ్చు.

* జియోహాట్‌స్టార్ కలయిక

కొంతకాలంగా ఈ కలయిక గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు యాడ్స్‌లో, డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో కూడా 'జియోహాట్‌స్టార్' పేరు కనిపించడంతో ఇది నిజమే అని చాలామంది ఫిక్సయిపోయారు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ఇకపై ఒకే గొడుగు కింద పనిచేస్తాయని ముందే లీకులు వచ్చాయి.

Tired of App Switching  JioHotstar Promises One Streaming Paradise

నిజానికి ఈ వ్యవహారం గతేడాది నుంచే నడుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), వయాకామ్18, వాల్ట్ డిస్నీ కంపెనీ.. వీళ్లందరూ కలిసిపోయి మీడియా బిజినెస్‌ను ఒకే దగ్గరికి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా డిస్నీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL) కంట్రోల్‌లో జరుగుతుంది.

* సబ్‌స్క్రిప్షన్లు బంద్, ప్లాన్స్ మారుతున్నాయా..

ఇంకో ట్విస్ట్ ఏంటంటే, జియో సినిమా కొత్తగా ఆటోపే సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడం ఆపేసింది. అంటే ప్లాన్స్‌లో ఏదో తేడా జరగబోతోందని నమ్ముతున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్‌ కోసం కొత్త ధరలు పెట్టే ఆలోచనలో ఉన్నారేమో అని తెలుస్తోంది. అలాగే రాబోయే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మ్యాచ్‌లు జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ వస్తాయట.

* హాట్‌స్టార్ యాప్‌లో జియో ఒరిజినల్స్

అంటే ఈ కొత్త యాప్‌లో స్పోర్ట్స్‌కి కూడా పెద్ద పీట వేస్తారని అర్థమవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇది ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. రీసెంట్‌గా డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో జియో సినిమా ఒరిజినల్స్, కలర్స్ రిష్తే ప్రోగ్రామ్స్ కూడా కనిపించడం మొదలయ్యాయి. అంటే రెండు ప్లాట్‌ఫామ్స్ కలవడానికి రెడీ అయిపోతున్నాయని క్లియర్‌గా తెలుస్తోంది.

* యూజర్లు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..

ఈ రెండు కలిస్తే యూజర్లకు ఒకటే ప్లాట్‌ఫామ్, కానీ కంటెంట్ మాత్రం డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు. బాలీవుడ్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు, ఇండియన్, ఇంటర్నేషనల్ టీవీ షోలు, అదిరిపోయే క్రికెట్ టోర్నమెంట్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ స్పెషల్ సిరీస్‌లు.. ఇలా లిస్ట్ చాలా పెద్దది.

* ఇండియన్ స్ట్రీమింగ్‌కి ఇది గేమ్ ఛేంజర్..

జియోహాట్‌స్టార్ వస్తే మాత్రం స్ట్రీమింగ్ మార్కెట్ షేక్ అయిపోతుంది. మిగతా యాప్స్‌కి గట్టి పోటీ తప్పదు. ముఖ్యంగా ఇండియాలో బాగా పాపులర్ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్, ZEE5, సోనీలీవ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా సంస్థలు తీవ్రమైన పోటీని తట్టుకోలేకపోతున్నాయి.

ఒకవేళ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలు కూడా తక్కువగా పెడితే, ఓటీటీ యాప్స్‌లో దీనికి తిరుగుండదు. ఇండియన్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇది ఒక పెద్ద మలుపు అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరి. జియోహాట్‌స్టార్‌కు సంబంధించి అన్ని అప్‌డేట్స్‌ని తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ని ఫాలో అవుతూ ఉండండి.

More from GizBot

Best Mobiles in India

English summary
JioHotstar combines JioCinema and Disney+ Hotstar into one streaming platform. This merger offers a vast library of movies, shows, and live sports, creating a major shift in India\'s competitive OTT market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X