గూగుల్ మ్యాప్స్ వాడేవాళ్లకి గుడ్‌న్యూస్.. బ్లూ బాణం గుర్తు మాయం.. మీ కారు బొమ్మతోనే ఇక నావిగేషన్..!
Google Maps: గూగుల్ మ్యాప్స్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు నావిగేషన్ స్టార్ట్ చేస్తే బ్లూ కలర్ బాణం గుర్తు మాత్రమే కనిపించేది కదా.. ఇకపై ఆ బాధ తప్పుతుంది. ఎందుకంటే, గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మీకు నచ్చిన వెహికల్ బొమ్మతో నావిగేషన్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆల్రెడీ ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు గత నవంబర్‌లోనే వచ్చేసింది. తర్వాత డిసెంబర్‌లో కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లకు టెస్టింగ్ కోసం ఇచ్చారు.
ఇప్పుడు మాత్రం ఆండ్రాయిడ్ బీటా యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. కొత్త ఫీచర్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. గూగుల్ మ్యాప్స్‌లో నావిగేషన్ మొదలుపెట్టినప్పుడు, ఇప్పటివరకు కనిపించే బ్లూ కలర్ బాణం గుర్తు బదులు, మీకు నచ్చిన వెహికల్ ఐకాన్ పెట్టుకోవచ్చు. అంతే, ఇక దీంట్లో రకరకాల వెహికల్స్ ఆప్షన్స్ ఉన్నాయి.

అవి సెడాన్ (Sedan), ఎస్‌యూవీ, జీప్ (Jeep), స్పోర్ట్స్ కారు (Sports Car), హ్యాచ్‌బ్యాక్ (Hatchback). ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక్కో వెహికల్‌కి ఎనిమిది రంగులు కూడా ఇస్తున్నారు. అంటే, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కలర్ కూడా మార్చుకోవచ్చు. ఫుల్లుగా పర్సనలైజ్డ్ నావిగేషన్ అన్నమాట.
* వెహికల్ ఐకాన్ ఎలా మార్చుకోవాలి?
దీన్ని మార్చడం కూడా చాలా ఈజీ. రెండు విధాలుగా మార్చుకోవచ్చు. ఒకటి నావిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు, మీరు ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్‌లో నావిగేషన్ స్టార్ట్ చేస్తారో, అప్పుడే "బ్లూ బాణం గుర్తు (Blue arrow)ను వెహికల్ ఐకాన్‌లా మార్చాలా?" అని ఒక ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మీరు మార్చుకోవచ్చు. రెండో విధానం మాన్యువల్‌గా మార్చడం.
ఒకవేళ మీరు ఆ పాప్-అప్ మిస్సయితే.. మాన్యువల్‌గా కూడా మార్చుకోవచ్చు. ఎలాగంటే.. నావిగేషన్ స్క్రీన్‌లో 'ట్రిప్ ఆప్షన్స్' అని ఉంటుంది (క్లోజ్ బటన్ పక్కనే). దాన్ని క్లిక్ చేయాలి. అందులో 'వెహికల్ ఐకాన్ వైల్ నావిగేటింగ్' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెహికల్స్, కలర్స్ కనిపిస్తాయి. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తూ నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
* ఎవరికి ఈ ఫీచర్..
ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్ బీటా వెర్షన్ 25.05.02.719889437 వాడుతున్న వాళ్లకి మాత్రమే కనిపిస్తుంది. మీరూ బీటా టెస్టర్ అయితే, ఫోన్‌లో ఈ ఫీచర్ వచ్చేసి ఉంటుంది. ఇంకా ఇది గూగుల్ మ్యాప్స్ నార్మల్ వెర్షన్‌లో లేదు. బీటాలో అందరికీ వచ్చేసింది కాబట్టి, ఇంకొన్ని వారాల్లో లేదా నెలల్లో ఫుల్ వెర్షన్‌లోనూ రిలీజ్ చేసేస్తారు.
* గూగుల్ మ్యాప్స్‌లోని ఇతర మార్పులు
2024, ఆగస్టులో గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ యాప్‌లో కింద ఉండే మెనూ బార్‌ని కూడా మార్చేశారు. అప్పట్లో ఐదు ట్యాబ్స్ ఉండగా.. వాటిని మూడుకి తగ్గించేశారు. 'గో' (Go), 'అప్‌డేట్స్' (Updates) ట్యాబ్స్‌ను తీసేశారు. 'సేవ్డ్' (Saved) ట్యాబ్‌ను 'యు' (You) అని పేరు మార్చారు. కానీ ఫంక్షన్ మాత్రం సేమ్ టూ సేమ్.
'ఎక్స్‌ప్లోర్' (Explore) ట్యాబ్ మాత్రం ఏం మార్చలేదు. 'గో' ట్యాబ్‌లో ఉండే ఫీచర్లన్నీ 'యు' ట్యాబ్‌లోని 'సేవ్డ్ ట్రిప్స్' లోకి మార్చేశారు. ఏదేమైనా, ఈ కొత్త అప్‌డేట్‌తో గూగుల్ మ్యాప్స్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా, నచ్చినట్టు మార్చుకునేలా ఉంటోంది. ఆండ్రాయిడ్ బీటా యూజరైతే నావిగేషన్ ఐకాన్ మార్చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, మెంబర్స్‌తోనూ ఇది షేర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








