Home
News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం TTD కీలక నిర్ణయం.. తొలిసారిగా ఈ టెక్నాలజీ..!

Tirumala Brahmotsavam 2025 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక చర్యలు తీసుకుంటోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ టీవోగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. టెక్నాలజీని ఇందుకు ఉపయోగించుకుంటోంది. క్యూలైన్ల నిర్వహణ సహా ఇతర ప్రాంతాల్లో టెక్నాలజీకి పెద్దపీట వేస్తోంది. వీలైనంత తక్కువ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం కలిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

Tirumala Brahmotsavam 2025

సాధారణం కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గదుల కేటాయింపు, పారిశుద్ధ్యం. అన్న ప్రసాదాల కేంద్రాలు, వాహనాల పార్కింగ్ వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టీటీడీ తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సంఖ్యలను అంచనా వేసేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO సాయం తీసుకోనుంది. ఇస్రో ఉపగ్రహా సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా ఉపయోగించుకోనుంది.

Tirumala Brahmotsavam 2025

రియల్‌ టైమ్‌లో జనసమూహాల పర్యవేక్షణ, నియంత్రణ కోసం L&T సంస్థ సాంకేతిక సాయాన్ని అందించనుంది. దీంతోపాటు తిరుమల శ్రీవారి వాహన సేవలు HD నాణ్యతతో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తిరుమలలో 35 LED స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

తిరుమలలో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Best Mobiles in India

English summary
Tirumala Brahmotsavam, first time TTD to use ISRO satellite technology to estimate devotees number
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X