ఉచిత ఆన్‌లైన్ కంటి పరీక్ష... ఇప్పుడే ట్రై చేయండి

|

 Titan Eye Plus launches its online eyetesting facility 'Vision Check' in regional languages
టైటాన్ ఇండస్ట్ర్రీస్ లిమిటెడ్‌లో ఓ భాగంగా ప్రపంచవ్యాప్తంగా నేత్ర సంబంధిత సేవలందిస్తున్న ‘టైటాన్ ఐ ప్లస్' తెలుగుతో సహా ఏడు ప్రాంతీయ భాషల్లో ఉచిత ఆన్‌లైన్ కంటి పరీక్షా సేవలను ప్రారంభించింది. తమ కళ్ల పనితీరును పరీక్షించుకోవాలనుకునే వారికి ఈ ‘విజన్ చెక్'గొప్ప అవకాశం. ఈ ఆన్‌లైన్ సర్వీస్‌ను టైటాన్ ఐ ప్లస్ తొలిగా ‘ప్రపంచ సైట్ దినోత్సవాన్ని' పురస్కరించుకుని అక్టోబర్‌లో ప్రారంభించింది. తొలినాళ్లలో ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, మళయాళం, తమిళ భాషల్లోకి ఈ సర్వీస్‌లను తీసుకువచ్చారు. ఐదు నిమిషాలు పాటు జరిగే ఈ పరీక్షలో భాగంగా యూజర్ తన ప్రాంతీయ భాషలో స్ర్కీన్ టెస్ట్‌ను ఎదుర్కొనే సౌకర్యాన్ని కల్పించారు. ప్రశ్నలను వివిధ కోణాల్లో ఎదుర్కొవల్సి ఉంటుంది. ఫలితం వెంటనే వెలువడుతుంది. 6 సంవత్సరాల వయసు పైబడిన వారు ఈ పరీక్షకు అర్హులు.

ప్రపంచవ్యాప్తంగా 3.3బిలియన్ మంది జనాభాకు ‘దృష్టి సవరణ' అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. మన దేశంలో 456మిలియన్ల జనాభాకు దృష్టి సవరణ అవసరమట. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఐవేర్ బిజినెస్ సీఈవో రవి కాంత్ స్పందిస్తూ తమ ఆన్‌లైన్ విజన్ పరీక్షలకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పుడే మీ కంటి పనితీరును పరీక్షించుకోవాలనుకుంటున్నారా ఈ లింక్ పై క్లిక్ చేయండి.

 
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X