ఆ ఫోన్లు కొంటే ఇకపై అన్నీ ఉచితం !

Written By:

జియోను దెబ్బకొట్టడానికి దిగ్గజ టెల్కోలన్నీ తమ దారిలో తాము పన్నాగం పన్నుతున్నాయి. జియో 4జీ ఫీచర్ ఫోన్ తో మార్కెట్లో అధిక వాటాను సొంతం చేసుకోవాలన్న జియో కలలను నిజం చేయకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి కూడా..ఈ వరసలో వొడాఫోన్ కొత్త ఆలోచనకు తెరలేపింది.

గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటెల్‌ సంస్థతో ఒప్పందం

దేశీయంగా రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా పేరున్న వొడాఫోన్‌ ఇండియా, చైనాకు చెందిన ఐటెల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంటెల్‌ 2జీ ఫీచర్‌ఫోన్లపై భారీమొత్తంలో వాయిస్‌ కాల్స్‌ను, క్యాష్‌బ్యాక్‌లను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది.

రూ.50 విలువ కలిగిన టాక్‌టైమ్‌ 18 నెలల పాటు ఉచితం

వాయిస్‌ యూజర్‌ బేస్‌ జియోకు తరలిపోకుండా ఆపేందుకు వొడాఫోన్‌ ఈ ప్లాన్‌ వేసింది. ఎవరైతే రూ.800 నుంచి రూ.1600 మధ్యలో ధర కలిగిన ఐటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తారో వారికి, రూ.50 విలువ కలిగిన టాక్‌టైమ్‌ 18 నెలల పాటు ఉచితంగా అందించనుంది.

80 శాతం రెవెన్యూలు

వొడాఫోన్‌కు 80 శాతం రెవెన్యూలు వాయిస్‌ వ్యాపారాల నుంచి వస్తుండటంతో, టెల్కో ఈ ఆఫర్ల వర్షం కురిపిస్తుందని సెక్టార్‌ యానలిస్టులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ చెప్పారు.

నెలలో రూ.100 మొత్తంతో రీఛార్జ్‌

ఈ ఆఫర్‌ కింద వొడాఫోన్‌ యూజర్లుఐటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్న ఇన్‌స్టాల్‌మెంట్లలో నెలలో రూ.100 మొత్తంతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రతినెలా రూ.50 విలువ కలిగిన అదనపు టాక్‌టైమ్‌

తర్వాత ప్రతినెలా రూ.50 విలువ కలిగిన అదనపు టాక్‌టైమ్‌, వచ్చే 18 నెలల పాటు అందించనుంది. మొత్తంగా రూ.900 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఐటెల్‌ అందించనుంది. అంటే రూ.800 ఇంటెల్‌ ఫోన్‌ పూర్తిగా ఉచితమన్నమాట.

ఆగస్టు 25 నుంచి అక్టోబర్‌ 31 వరకు

ఫెస్టివ్‌ సీజన్‌కు అనుకూలంగా ఆగస్టు 25 నుంచి అక్టోబర్‌ 31 వరకు వొడాఫోన్‌ కస్టమర్లకు ఈ ఆఫర్‌ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుందని ఐటెల్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుదీర్‌ కుమార్‌ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
To combat Reliance Jio, Vodafone to offer free talk time with Itel phones Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot