ఐటీ రంగంలో అలా చేయడానికి కారణం పోటీ వాతావరణం కోసమే

By Super
|
IT Industry
కిశోర్‌ ఓ బహుళజాతి సంస్థలో ఐటీ రంగ నిపుణుడు. ఇటీవల కిశోర్‌ని బాస్‌ పిలిచి వేరొకరు పూర్తి చేసిన ప్రాజెక్టుని తిరిగి మళ్లీ చేయమని చెప్పారు. తొలుత సంకోచించినప్పటికీ తర్వాత ఆ సవాల్‌ను స్వీకరించాడు. తన లక్ష్యం పూర్తయ్యాక అసలు విషయాన్ని గ్రహించాడు. తాను పూర్తి చేసిన ప్రాజెక్టుని కూడా ఇలాగే వేరొకరికి అప్పగించినట్లు తెలుసుకున్నాడు. ఒకే ప్రాజెక్టుని నలుగిరితోనూ వేర్వేరుగా చేయించడం అనేది నైపుణ్యానికి మరింత పదును పెట్టి వారిని ప్రోత్సహించడమే తప్ప పోటీని నెలకొల్పి ఇబ్బందులు సృష్టించడం మాత్రం కాదని గ్రహించాడు. ఒక్కోసారి పోటీ వాతావరణం బృంద సభ్యుల మధ్య కూడా ఉండే అవకాశాలున్నాయి.

కార్యాలయంలో పోటీ వాతావరణం అన్ని వేళలా ఉండదు. ఒకవేళ అది ఉన్నప్పుడు.. ఆరోగ్యకరంగా ఉండాలే కానీ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించుకోకూడదు. లక్ష్యాలు చేరుకోవాలన్న తపనే కానీ ఎదుటవారిని వెనక్కినెట్టాలని భావించకూడదు. బృందంలోని సహచరుల మధ్య పోటీ నెలకొనప్పుడు సృజనాత్మకత, ఆవిష్కరణలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ సిబ్బంది ఈ విషయాన్ని గ్రహించలేకపోతే బాస్‌/బృందనాయకుడు పరోక్షంగానైనా వారికి తెలిసేలా చేయాలి. అంతర్గత పోటీ వల్ల లక్ష్యాలు త్వరగా చేరుకోగలతామని గ్రహించాలి. అంతేకాదు బృంద సభ్యుల మధ్య పోటీ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తుంది కూడా. లక్ష్యం పూర్తి చేయడానికి ఎంచుకొనే మార్గాలు నూతన ఆవిష్కరణలకు దారిచూపుతాయి. అంతేకానీ పోటీ వాతావరణం వల్ల ఇబ్బందులొస్తాయని లేనిపోని ఆందోళనలకు గురికావద్దు.

లక్ష్యం చేరుకొనే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో జయించాలి. ఎవరి సహాయం లేకుండా మీరొక్కరే లక్ష్యం పూర్తి చేయాల్సి వస్తోందని అభద్రతాభావానికి గురికావద్దు. సమయపాలన పాటిస్తూ ఎప్పటికప్పుడు పని పూర్తి చేసుకుంటుండాలి. ఎదుటివారు ఏం చేస్తున్నారు.. వారి పని ఎంత వరకూ వచ్చింది.. అనే అంశాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరచకూడదు. పనిమీదే దృష్టి సారించాలి. బాస్‌ ఎప్పుడైనా సమీక్ష నిర్వహించినపుడు తప్పకుండా సహచరుల పనితీరు ఎలాగూ తెలుస్తుంది కాబట్టి లేనిపోని ఆలోచనలతో సమయాన్ని వృథా చేసుకోకూడదు. క్లయింట్లు అడిగే ప్రతి సమస్యను మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్న పనిపై పూర్తి పట్టు సాధించగలగాలి. మరీ ఇబ్బంది అయితే సహచరుల సూచనలు తీసుకోవడం తప్పేమీ కాదు.

అంతర్గత పోటీ వల్ల సిబ్బంది ఒత్తిడికి గురవుతారని బృంద నాయకుడు /బాస్‌ భావించకూడదు. ఫలితాలపై ప్రభావం చూపుతుందేమోనని, స్వల్పకాలిక లాభాలే వస్తాయనుకుని.. ఇలాంటివి చేయడం కూడదనుకోవద్దు. బృందంతోనే కాదు వ్యక్తిగతంగానూ లక్ష్యాలు సకాలంలో చేరుకోవడానికి ఇలాంటి పోటీ వాతావరణం ఎంతగానో సహకరిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X