హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

Posted By:

100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్, సోమవారం తన తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.

సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది. నాటి నుంచి నేటి వరకు ఫేస్‌బుక్ అధరోహించిన మైలురాళ్లను ఫోటో గ్యాలరీ రూపంలో మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

పేజ్ వ్యూస్: ఏడాదికి ఒక్క యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫేస్‌బుక్‌కు 400 బిలియన్‌ల పేజ్ వ్యూస్ లభిస్తాయి.

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

టైమ్ స్పెండ్: ఫేస్‌బుక్ కోసం రోజు సగటు మనిషి ఖర్చు చేసే సమయం 20 నిమిషాలు.

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

టాప్ 10: యునైటెడ్ స్టేట్స్, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, ఫ్లోరిడా, ఓహియో, ఉత్తర కారోలినా, జార్జియా, ఇనోస్ వంటి దేశాల్లో 50శాతానికి పైగా ఫేస్‌బుక్ యూజర్లు సగానికి పైగా ఉన్నారు.

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

నంబర్ వన్: 2010కుగాను యునైటెడ్ స్టేట్స్ నెంబర్ వన్ వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ గుర్తింపు తెచ్చుకుంది.

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

ఫేస్ బుక్ వినియోగానికి సంబంధించి ఆసియా ఖండానికి గాను ఇండియా, ఇండోనేషియా తరువాతి స్థానాన్ని ఫిలిప్పిన్స్ ఆక్రమించింది. ఇక్కడి ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 27, 247,220.

హ్యాపీ బర్త్‌డే ‘ఫేస్‌బుక్’

భారత్ ఫేస్‌బుక్ యూజర్‌ల సంఖ్య 45మిలియన్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot