Home
News

Tokyo ఒలింపిక్స్ మెడల్స్!! మొబైల్ రీసైకిల్ మెటల్‌తో తయారు చేసారు...

ఒలింపిక్స్‌లో ఆడటం మరియు అందులో బంగారు పథకాన్ని గెలవడం అనేది ప్రతి అథ్లెట్లకు గల కోరిక. ఈ గొప్ప విజయంను సాధించడం మరియు పతకంను గెలవడం అనేది చెప్పలేని మధురమైన క్షణం. ఈ సంవత్సరం జపాన్ లోని టోక్యో నగరంలో నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు గెలుచుకునే ప్రతి పతకాలు పర్యావరణ సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకొని ఆశ్చర్యకరమైన మూలాలతో తయారుచేసారు. కావున గెలిచిన వారికి పతకం తీసుకునే ఆనందం రెట్టింపు అవుతుంది. చరిత్రలో మొదటిసారిగా- బంగారం, వెండి మరియు కాంస్య ఒలింపిక్ మరియు పారాలింపిక్ పతకాలు సెల్ ఫోన్‌లతో సహా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసి వాటి నుండి తయారుచేసారు.

టోక్యో 2020 మెడల్ ప్రాజెక్ట్

టోక్యో 2020 మెడల్ ప్రాజెక్ట్

రెండు సంవత్సరాలుగా టోక్యో 2020 మెడల్ ప్రాజెక్ట్ 5,000 ఒలింపిక్ పతకాలను తయారుచేయడానికి జపాన్ యొక్క దేశవ్యాప్తంగా 6.21 మిలియన్ సెల్ ఫోన్‌లతో సహా 78,985 టన్నుల ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించింది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసి 5,000 ఒలింపిక్ పతకాలలో బంగారు, వెండి, మరియు కాంస్య స్మెల్టింగ్ అంశాలతో తయారుచేసారు. ద్రవీభవన ప్రక్రియతో బంగారం, వెండి మరియు కాంస్య అంశాలు విద్యుత్ పరికరాల నుండి సేకరించబడ్డాయి. టోక్యో గేమ్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఒలింపిక్స్ చరిత్రలో రీసైకిల్ చేసిన లోహాన్ని ఉపయోగించి పతకాలు తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇటువంటి వాటి ఉత్పత్తిలో సాధారణ పౌరులు కూడా పాలుపంచుకోవడం ఇదే మొదటిసారి.

టోక్యో యొక్క సుస్థిరత ప్రాజెక్టులు

టోక్యో యొక్క సుస్థిరత ప్రాజెక్టులు

కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 ఒలింపిక్ గేమ్స్ వాయిదా పడినప్పటికీ 2020 గేమ్ లను రీబ్రాండ్ చేయకూడదని నిర్వాహకులు నిర్ణయించినందున ఈవెంట్ పేరు మరియు లోగో రీసైకిల్ చేయబడ్డాయి. కార్డ్‌బోర్డ్ ప్యాట్రన్డ్ బెడ్‌లు ఇప్పటికే ముఖ్యాంశాలుగా మారాయి, ఎందుకంటే కొంతమంది అథ్లెట్‌లు సెక్స్ చేయకుండా నిరోధించడానికి రూపొందించబడినట్లు సిద్ధాంతీకరించారు. తరువాత ఒలింపిక్ అధికారులు పడకలు వాటి స్థిరత్వం మరియు దృఢత్వం కారణంగా అందించబడ్డాయని స్పష్టం చేశారు.

టోక్యో ఒలింపిక్ గేమ్స్ రీసైక్లింగ్ వస్తువులు

టోక్యో ఒలింపిక్ గేమ్స్ రీసైక్లింగ్ వస్తువులు

2020 ఒలింపిక్ గేమ్స్ లో పోడియంలు రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడ్డాయి. అంతేకాకుండా ఒలింపిక్ టార్చ్‌లో అల్యూమినియంను ఉపయోగించడం కొసమెరుపు. ఇది జపాన్ ఫుకుషిమా విపత్తు తర్వాత ఉపయోగించిన తాత్కాలిక గృహాల నుండి రీసైకిల్ చేయబడింది. ఈవెంట్ సమయంలో ఉత్పత్తి అయ్యే 65% వ్యర్థాలను తిరిగి ఉపయోగించడం లేదా రీసైక్లింగ్ చేయడం లక్ష్యంతో తమ తదుపరి ప్రణాళికను ఏర్పాటు చేసింది. అలాగే ఈ ఆటల కోసం సేకరించిన 99% వస్తువులను రీసైకిల్ చేయడం లేదా తిరిగి ఉపయోగించడం కూడా నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒలింపిక్స్

ఒలింపిక్స్‌లో ఏర్పాటు చేసిన పర్యావరణ అనుకూల ప్రయత్నాలు అతిశయోక్తి అని విశ్లేషకులు పేర్కొన్నారు. "దురదృష్టవశాత్తు, 1992 నుండి 2020 వరకు కాలక్రమేణా అన్ని కోణాలలో నిలకడ తగ్గుతున్నట్లు డేటా చూపుతుంది" అని స్విట్జర్లాండ్‌లోని లౌసాన్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ మరియు పరిశోధకుడు స్వెన్ డేనియల్ వోల్ఫ్ తెలిపారు. వోల్ఫ్ జోడించారు "ఒలింపిక్ ఉద్యమానికి మూలస్తంభాలలో పర్యావరణవాదం మరియు స్థిరత్వం ఒకటి అయినప్పటికీ క్షీణత జరుగుతోంది".

ఒలింపిక్స్ నిలకడ లేకపోవడంపై ఎక్కువగా ప్రశ్నించబడుతున్నాయి. ఉదాహరణకు 2018 లో ప్యోంగ్‌చాంగ్ ఒలింపిక్స్ కోసం ఒలింపిక్ స్టేడియం $ 100 మిలియన్లను ఖర్చు చేయడం ద్వారా తయారు చేయబడింది. అయితే ఇది ఆ గేమ్స్ తర్వాత కూల్చివేయబడింది.

 

Best Mobiles in India

English summary
Tokyo Olympics 2020 Medals Are Made From 6.21 Million Recycled Electronics Device Metal Extracted
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X