Home
News

జియో తరువాత ప్లాన్ ఏంటీ, ముఖేష్ అంబానీ ఏం చేయబోతున్నారు ?

దేశీయ టెలికాం రంగంలో జియో తరువాత ముఖేష్ అంబానీ ఏం తీసుకువస్తున్నారు అనే దానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడిపోయింది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో జియో తరువాత ముఖేష్ అంబానీ ఏం తీసుకువస్తున్నారు అనే దానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడిపోయింది. రిలయన్స్ ఏజీఎం 41 ఈవెంట్‌లో జియో అధినేత తన తరువాత ప్లాన్లను ఆవిష్కరించారు. జియో ఆఫర్లు, జియో ఫోన్ తరువాత ఏం తీసుకువస్తున్నారనే దానిపై జియో అధినేత ముఖేష్ అంబానీ విపులంగా వివరించారు. ఈ సమావేశంలో జియో ప్రస్థానంలోని విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ఇలాగే కొనసాగాలని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. డిజిటల్ ఇండియాని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు జియో ముందడుగు వేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జియో నుంచి వచ్చిన అతి పెద్ద అనౌన్స్ మెంట్లను ఓ సారి పరిశీలిస్తే..

జియోఫోన్ విజయం

జియోఫోన్ విజయం

జియోఫోన్ వాడుతున్న వారు దేశంలో ఇప్పుడు 25 మిలియన్ల మంది ఉన్నారని ఇది జియో సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా జియోఫోన్ దూసుకెళ్లిందని చెప్పారు. గతేడాది ఈ ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 100 మిలియన్ల మందికి ఈ ఫోన్ చేరే లక్ష్యంగా జియో పనిచేస్తుందని తెలిపారు.

జియోఫోన్2

జియోఫోన్2

రియలన్స్ జియో వచ్చే తరం జియోఫోన్ 2ని ఈ ఈవెంట్లో లాంచ్ చేసింది. రూ.2,999 ధరలో ఈ ఫోన్ వినియోగదారులకు ఆగస్టు 15 నుంచి లభ్యం కానుంది.
జియోఫోన్ 2 ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

జియోఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్

జియోఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్

కాగా గతేడాది లాంచ్ చేసిన జియోఫోన్ మీద మాన్ సూన్ హంగామా ఆఫర్ ని ప్రవేశపెట్టారు. ఈ ఆఫర్‌ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్‌ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు.ఈ ఆఫర్ జూలె 21 నుంచి ప్రారంభం కానుంది.

జియో కొత్త యాప్స్

జియో కొత్త యాప్స్

ఏజీఎం ఈవెంట్లో జియోఫోన్ కోసం 3 కొత్త యాప్స్ ని ప్రవేశపెట్టారు. YouTube, WhatsApp, and Facebook లాంటి ఫీచర్లను ఈ ఫోన్లో ప్రవేశపెట్టారు. ఇవి ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

రిలయన్స్ జియో గిగాఫైబర్

రిలయన్స్ జియో గిగాఫైబర్

సెటాప్‌బాక్స్‌ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్‌ సేవలను అందించనున్నట్టు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. చిన్న వ్యాపారుల కోసం అలాగే మధ్య తరగతి వారికి అత్యంత తక్కువ ధరలో ఎక్కువ స్పీడ్ గల బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు దీన్ని తీసుకువచ్చారు. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

జియో గిగారూటర్

జియో గిగారూటర్

స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియో గిగారూటర్ ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు డౌన్లోడ్ ,అప్ లోడ్ స్పీడ్ ని అమితవేగంతో పొందవచ్చు. ఈ రూటర్ వైఫై కవరేజి కూడా చేస్తుంది.

జియో గిగా టీవి సెట్ టాప్ బాక్స్

జియో గిగా టీవి సెట్ టాప్ బాక్స్

పాత టీవీ సెట్ టాప్ బాక్స్ బోర్ కొట్టిందనుకునే వారికి జియో కొత్త సెట్ టాప్ బాక్స్ ని అందించబోతోంది. దీని ద్వారా 600 ఛానల్స్ అలాగే ఆన్ లైన్ యాక్ససె కంటెంట్ ని తిలకించవచ్చు. 4కె క్వాలిటితో మీరు మంచి వ్యూయింగ్ అనుభూతిని పొందవచ్చు.జియో రిమోట్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకునే సదుపాయం కూడా రానుంది.

జియోగిగా టీవీ కాలింగ్

జియోగిగా టీవీ కాలింగ్

జియో ఈ ఈవెంట్లో కొత్త ప్రకటన విడుదల చేసింది. అదే జియోగిగా టీవీ కాలింగ్. మీరు జియోగిగా ఫైబర్ ను ఉపయోగించి టీవికి అనుసంధానమై వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఏ స్మార్ట్ ఫోన్ ,ట్యాబ్లెట్ కు అయినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.

జియో వర్చువల్ రియాలిటీ

జియో వర్చువల్ రియాలిటీ

జియోగిగా ఫైబర్ ద్వారా మీరు వర్చువల్ రియాలిటితో 4కె వీడియోలను తిలకించే సదుపాయాన్ని కల్పిస్తోంది. వీఆర్ హెడ్ సెట్ ద్వారా మీరు 360-degreesలో కంటెంట్ ను వీక్షించవచ్చు.

జియో స్మార్ట్‌హోమ్

జియో స్మార్ట్‌హోమ్

ఇందులో భాగంగా జియో వినియోగదారుల కోసం smart speakers, smart plug, outdoor/indoor cameras, TV camera, smoke or gas leak sensors, door sensors, and panic buttons లాంటి వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. 

మైజియో యాప్స్ ద్వారా..

మైజియో యాప్స్ ద్వారా..

వీటన్నింటిని మైజియో యాప్స్ ద్వారా కంట్రోల్ చేసుకునే సదుపాయాన్ని జియో తీసుకురానుంది. గంటలో జియో ఇంజనీర్లు మీకు జియోగిగాఫైబర్ ని అందించే ఏర్పాట్లు చేయనున్నారు.

 

 

 

Best Mobiles in India

English summary
JioGigaFiber to JioPhone 2: Top 10 announcements from the Reliance AGM 2018 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X