2020లో విడుదల అయిన అద్భుతమైన డిజైన్ స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!!!

|

ప్రపంచం మొత్తం టెక్నాలజీ రంగంలో చాలా అభివృద్ధిని సాదిస్తున్నది. రోజు రోజుకి కొత్త కొత్త అప్‌డేట్ లను తీసుకువస్తున్నది. ఈ కొత్త అప్‌డేట్ లో భాగంగా ఆసక్తికరమైన అనేక స్మార్ట్ పరికరాలు మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. మీరు ప్రస్తుతం బ్లూటూత్ మరియు AI టెక్నాలజీపై ఆధారపడిన చాలా స్మార్ట్ పరికరాలను చూశారు. కానీ రాబోయే కొన్ని స్మార్ట్ పరికరాలు వీటి కంటే మెరుగైన ఫీచర్లతో ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విదంగా ఉండనున్నాయి.

 

2020లో విడుదల అయిన స్మార్ట్ గాడ్జెట్లు

2020లో విడుదల అయిన స్మార్ట్ గాడ్జెట్లు

సాంకేతిక రంగం ప్రస్తుతం మంచి అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తున్నది. గతంలో కంటే ఇప్పుడు సరికొత్త పరికరాలను మార్కెట్లోకి ఎక్కువగా విడుదల అయ్యాయి. సమీప భవిష్యత్తులో రాబోయే కొన్ని స్మార్ట్ పరికరాల సృష్టి ఏవిధంగా ఉందొ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 2020లో విడుదల అయిన అద్భుతమైన డిజైన్ స్మార్ట్ పరికరాల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Google ప్లే స్టోర్ నుంచి ఈ నాలుగు లోన్ యాప్ లు అవుట్!!!Also Read: Google ప్లే స్టోర్ నుంచి ఈ నాలుగు లోన్ యాప్ లు అవుట్!!!

బ్యాంగ్ మరియు ఓలుఫ్సేన్ బీపుల్ E8 స్పోర్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
 

బ్యాంగ్ మరియు ఓలుఫ్సేన్ బీపుల్ E8 స్పోర్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

బ్యాంగ్ మరియు ఓలుఫ్సేన్ బీపుల్ E8 స్పోర్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ అనేది స్టైలింగ్ ను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకొని తయారుచేసారు. దీనిని ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఇన్స్టెంట్ స్టైలింగ్ లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు వాటర్ నిరోధితమైనవి కాబట్టి మీ యొక్క వ్యాయామాల సమయంలో మరియు స్విమ్మింగ్ చేసేటప్పుడు మరియు వర్షం కురిసే సమయంలో కూడా మీరు వాటిని ధరించవచ్చు.

శామ్సంగ్ ఒడిస్సీ G9 కర్వ్డ్ గేమింగ్ మానిటర్

శామ్సంగ్ ఒడిస్సీ G9 కర్వ్డ్ గేమింగ్ మానిటర్

శామ్సంగ్ ఒడిస్సీ G9 కర్వ్డ్ గేమింగ్ మానిటర్ అనేది 2020 సంవత్సరం ఉత్తమమైన ఉత్పత్తి డిజైన్లలో ఒకటి. ఇది బ్లూ కలర్ లో వృత్తం యొక్క కనురెప్పలా కనిపించే ఇన్ఫినిటీ కోర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది మీ యొక్క కంటి ఆకృతులకు సరిపోయే స్క్రీన్ ను వక్ర రూపంలో కలిగి ఉంటుంది.

Atmof విండో 2 స్మార్ట్ వాల్

Atmof విండో 2 స్మార్ట్ వాల్

అట్మోఫ్ విండో 2 స్మార్ట్ వాల్ యొక్క డిస్ప్లే స్క్రీన్ చూడడానికి అచ్చంగా విండో లాగానే ఉంటుంది. ఇది మీ యొక్క ఇంటిలో ఎక్కడైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇది రకరకాల వీక్షణలను మార్చడానికి కూడా వీలును కల్పిస్తుంది. ఇందులో గల 1,000 రకాల వీక్షణలలో ఒకదాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

కేవియర్ సైబర్‌ఫోన్ టెస్లా సైబర్‌ట్రక్ ఐఫోన్ 11 ప్రో

కేవియర్ సైబర్‌ఫోన్ టెస్లా సైబర్‌ట్రక్ ఐఫోన్ 11 ప్రో

లగ్జరీ ధరలో విడుదల కానున్న ఈ ఫోన్ చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్లా సైబర్‌ట్రక్ మాదిరిగానే రేఖాగణిత రేఖలను కలిగి ఉంది. అలాగే ఇది టైటానియం మెటల్ ప్లేట్ ను కలిగి ఉండడం కారణంగా ఈ ఫోన్‌ అత్యంత మన్నికైనదిగా ఉంటుంది.

GRIS డిజైన్‌తో OP-S కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్

GRIS డిజైన్‌తో OP-S కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్

GRIS డిజైన్ OP-S కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ 2020 లో విడుదల అయిన ఉత్తమమైన డిజైన్ ఉత్పతులలో ఒకటి. సంగీతంను ఎక్కువగా ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకొని దీనిని తయారుచేసారు. ప్రయాణ సమయంలో కూడా సంగీత ప్రియులు ఈ స్మార్ట్‌ఫోన్‌తో వారికి నచ్చిన సంగీతంను సృష్టించవచ్చు. ఈ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఫుల్ కీబోర్డ్, నాలుగు హై-డెఫినిషన్ మైక్రోఫోన్లు మరియు 32-బిట్ DAC ఉన్న ఆడియో I / O వంటివి ఉన్నాయి.

జింగ్కో స్మార్ట్ ఎకార్డియన్ లాంప్

జింగ్కో స్మార్ట్ ఎకార్డియన్ లాంప్

జింగో స్మార్ట్ ఎకార్డియన్ లాంప్ అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ వినూత్న దీపం అకార్డియన్ ప్రేరణతో రోపొందించారు. ఈ దీపం కాంతి యొక్క చివరలను లాగినప్పుడు ఓపెన్ అవుతుంది. దీని చివరలు అయస్కాంతంను కలిగి ఉంటాయి కాబట్టి మీకు కావలసినన్ని యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు.

పాలిగాన్ లైట్ మాగ్నెటిక్ లైటింగ్ టైల్స్ పాలిగాన్ లైట్

పాలిగాన్ లైట్ మాగ్నెటిక్ లైటింగ్ టైల్స్ పాలిగాన్ లైట్

మాగ్నెటిక్ లైటింగ్ టైల్స్ అనేవి 2020 సంవత్సరంలో క్రియేటివ్ లైటింగ్ డిజైన్లలో అద్భుతమైన ఎంపికను కలిగి ఉంది. ఇది తేలికపాటి పలకల డిజైన్ ను కలిగి ఉండి గోడపై అతికించడానికి వీలుగా ఉంటుంది. దీనిని మీ చేతితో సరళమైన స్పర్శతో వాటిని ఆన్ చేయవచ్చు. గోడ అలంకరణ కోసం మీరు ఎంచుకున్న ఏ దిశలోనైనా మీకు నచ్చిన విధంగా ఈ పలకలను కనెక్ట్ చేయడానికి వీలుగా ఉండే విధంగా అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Top 10 Best Gadgets Design of 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X