Home
News

గత మూడు నెలల్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లు ఏంటో తెలుసా... ఆసక్తికర నివేదిక!

గతంలో పోలిస్తే స్మార్ట్‌ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతోపాటు అనేక మంది మార్కెట్‌ లోకి వచ్చిన కొత్త మోడళ్లకు అప్‌ గ్రేడ్‌ అవుతున్నారు. ఫలితంగా ప్రముఖ బ్రాండ్లు వివిధ ఫీచర్ల తో సరికొత్త మోడళ్లను అందిస్తున్నాయి. ప్రీమియం ఫోన్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

అయితే తాజాగా కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో (ఈ సంవత్సరంలో తొలి మూడు నెలల్లో) గరిష్ఠంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ జాబితాను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం తొలిస్థానంలో ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ నిలిచింది.

Top 10 best selling smartphones in 2024 first Q1

దీంతోపాటు ఆపిల్‌కు చెందిన ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 15 మోడళ్లు ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్రో కూడా అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 10 (Best Selling Top 10) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ లిస్ట్‌ మీకోసం.
తొలి మూడు నెలల్లో అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 10 స్మార్ట్‌ఫోన్లు జాబితా..

1. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌
2. ఐఫోన్ 15
3. ఐఫోన్‌ 15 ప్రో
4. ఐఫోన్‌ 14
5. శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా
6. శాంసంగ్ గెలాక్సీ A15 5G
7. శాంసంగ్‌ గెలాక్సీ A54
8. ఐఫోన్‌ 15 ప్లస్‌
9. శాంసంగ్‌ గెలాక్సీ S24
10. శాంసంగ్ గెలాక్సీ A34

Top 10 best selling smartphones in 2024 first Q1

టాప్‌ 10 అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ ఫోన్లలో 7 ప్రీమియం హ్యాండ్‌ సెట్‌లు ఉన్నాయి. అంటే ఎంట్రీ లెవల్ మరియు మిండ్‌ రేంజ్‌ ఫోన్‌ల కంటే ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ నివేదిక ఆధారంగా వెల్లడైంది.

ఐఫోన్‌ 15ప్రో మ్యాక్స్‌ స్పెసిఫికేషన్లు..
ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. A17 ప్రో చిప్‌సెట్‌తో విడుదల అయింది. గ్రేడ్‌ 5 టైటానియం బాడీను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ముందు భాగం సిరామిక్‌ షీల్డ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా అదనపు భద్రతను అందిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ డైనమిక్‌ ఐలాండ్‌ నాచ్‌ మరియు యాక్షన్‌ బటన్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. తక్కువ లైటింగ్‌లోనూ నాణ్యమైన ఫొటోలు క్యాప్చర్‌ చేయవచ్చు. ఈ కెమెరా ద్వారా 4K 60 Pro Res నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

గత సంవత్సరం కూడా అత్యధికంగా అమ్ముడైనా జాబితాలో ఆపిల్‌, శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ లు అగ్రస్థానంలో ఉన్నాయి. తొలి త్రైమాసికంలో ఆపిల్‌ ప్రో మోడళ్లు 60 శాతం విక్రయాలు సాధించాయి. దీంతోపాటు శాంసంగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లతో శాంసంగ్‌ భారీగా పుంజుకుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Top 10 best selling smartphones in 2024 first Q1 here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X