ప్రపంచవ్యాప్తంగా ప్రోడక్ట్స్ డెలివరీ చేసే టాప్ 10 బెస్ట్ షాపింగ్ సైట్స్ ఇవే.

Posted By: SANTHOSHIMA VADAPARTHI

భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా మనం గమనించినట్లయితే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లకు చాలా ప్రజాదరణ పెరిగింది.ఫ్లిప్కార్ట్,మిన్ త్రా,కూవ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెబ్సైట్స్ వచ్చాయి.అయితే మనలో చాలామంది భారతదేశంలో అందుబాటులో లేని కొన్ని వస్తువులు కొనుగోలుచేయటానికి చూస్తూ వుంటారు.ఉదాహరణకు,మీరు అమెరికన్ బట్టల షాప్స్ లో మాత్రమే లభించే బట్టలని కొనాలని అనుకుంటారు,మరి వాటిని ఇక్కడ మీరు కొనటం కష్టం.అందుకే అలాంటి వారికోసం ప్రపంచవ్యాప్తంగా ప్రోడక్ట్స్ ను పంపిణీ చేసే షాపింగ్ సైట్ల లిస్ట్ ను మేము మీకు తెలుపుతున్నాము .

ప్రపంచవ్యాప్తంగా ప్రోడక్ట్స్  డెలివరీ చేసే టాప్ 10 బెస్ట్ షాపింగ్ సైట్

మీరు ఇక్కడ లిస్ట్ చేయబడిన వెబ్సైట్స్ ని బాగా పరిశీలించటం ద్వారా,మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ని మీరు ఈవెబ్సైట్స్ ద్వారా పొందవచ్చు.

మీరు అనుకున్నసేమ్ ప్రోడక్ట్ పొందలేకపోయిన ,కనీసం దానికి దగ్గరగా వుండే ప్రోడక్ట్ ని మీరు పొందవచ్చు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ని అందించే 10 ఉత్తమ ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్ సమాచారం క్రిందకి స్క్రోల్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్

వాషింగ్టన్ మరియు సీటెల్ లో బాగా పాపులర్ అయిన ఈ కామర్స్ ప్లాట్ఫారం లలో అమెజాన్ ని ముఖ్యమైనదిగా చెప్పవచ్చు . ఇది ఇండియా,ఆస్ట్రేలియా ,బ్రెజిల్ ,చైనా, ఫ్రాన్స్ ,జర్మనీ ,మెక్సికో ,స్పెయిన్ ,యునైటెడ్ కింగ్డమ్ వంటి ఎన్నో దేశాలకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ని అందిస్తుంది.

ఈబే

ఈబే అనేది మల్టినేషనల్ ఈ కామర్స్ కంపెనీ,ఇది ఇండియా ,ఇటలీ ,కొరియా, స్పెయిన్,యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలకు ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తుంది.దుస్తులనుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వరకు మీకు కావలిసిన ఏ రకమైన ప్రోడక్ట్ అయినా మీరు ఇక్కడ పొందవచ్చు.

మాసీస్

ఇది యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ ,మీరు ఇక్కడ చాలా మంచి దుస్తులు, యాక్ససరీస్ ,షూస్ వంటి కలెక్షన్ ని పొందుతారు.ఈ వెబ్సైట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ని కూడా అందిస్తుంది.మీకు కావలసిన వస్తువు మీ ఇంటికి సులభంగా డెలివరీ చేయబడుతుంది.

టాయ్స్ ఆర్ అస్

పేరుకి తగ్గట్టుగానే టాయ్స్ ఆర్ అస్ అన్ని రకాల సైజ్ టాయ్స్ ని కలిగి ఉంటుంది.ఈ సైట్ లో గేమ్-ఫోకస్డ్ కంప్యూటర్స్ మరియు టాబ్లెట్స్ అందుబాటులో కలవు . ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకి ప్రోడక్ట్స్ ని షిప్ చేస్తుంది.

ది బాడీ షాప్

భారత దేశంలో ఎన్నో ఫిజికల్ బాడీ షాప్ స్టోర్స్ కలవు . కానీ ఎల్లప్పుడూ ఆన్లైన్ లో వస్తువులు ఎంచుకోవటం చాలా సౌకర్యవంతం గా ఉంటుంది .వెబ్సైట్ UK కి చెందినదయినా ,ఇది ఇండియా తో పాటుగా పలు దేశాలకు తన సేవలను అందిస్తుంది.

జియో బాటలో ఐడియా, పాత ప్లాన్లలో భారీ మార్పులు !

జెసిపెన్నీ

మీరు కొత్త దుస్తులు మరియు నగలు ఇంకా హోమ్ ఫర్నిచర్ కోసం చూస్తున్నట్లయితే జెసి పెన్నీ మీకోసం ఒక సరైన చోటు .మరియు ఈ వెబ్సైట్ తన ప్రోడక్ట్స్ ని ఇండియా,జపాన్, చైనా వంటి ఆసియా పసిఫిక్ దేశాలకు షిప్పింగ్ చేస్తోంది.

షూస్

ఇక్కడ షూస్ అంటే అన్ని రకముల షూస్ ని మీరు పొందవచ్చు .ఇక్కడ ,మీరు అన్ని రకముల ఇంటర్నేషనల్ బ్రాండ్ షూస్ ని పొందవచ్చు .దీనిలో ఉత్తమమైన విషయం ఇది ఇంటర్నేషనల్ డెలివరీ అందిస్తుంది .

ఎట్ సి

మీరు పాత వస్తువులకు ఒక సరైన స్టోర్ కొనుగొనలేకపోతే,ఎట్ సి జ్యువెలరీ నుంచి పెయింటింగ్స్ వరకు పాత కాలపు వస్తువుల విస్తృత శ్రేణిని కలిగి వుంది.ఇది కూడా తన ప్రోడక్ట్ లను ప్రపంచవ్యాప్తంగా డెలివరీ చేస్తుంది.

షాప్ బాప్

ఫ్యాషన్ పై మక్కువ వున్న ప్రతివారు ఈ వెబ్సైట్ ని చెక్ చేయాలి .షాప్ బాప్ మహిళల కోసం గొప్ప డిజైనర్ దుస్తుల కలెక్షన్ తో పాటుగా ఇంటర్నేషనల్ షిప్పింగ్ అందిస్తుంది.

ప్లే-ఆసియా

ప్లే-ఆసియా ఆన్లైన్ స్టోర్ వీడియో గేమ్స్ ,మూవీస్ ,మ్యూజిక్ మరియు ఇతర ఆసక్తికర ఐటమ్స్ ని కలిగివుంది . మీరు మెమరీ కార్డ్స్, ఆడియో యాక్ససరీస్ ,మొబైల్స్ మొదలైనవి కూడా పొందవచ్చు. ప్లే ఆసియా తన ప్రోడక్ట్స్ ని ఎన్నో దేశాలకి డెలివరీ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Even if you don't find the exact same product, at least you will get your hands on something similar. In any case, scroll down to read the 10 best online shopping stores that provide global shipping.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot