ఫేస్‌బుక్ యూజర్లు.. ఏఏ దేశాల్లో ఎంతెంత?

By Super
|
ఫేస్‌బుక్ యూజర్లు.. ఏఏ దేశాల్లో ఎంతెంత?


న్యూయార్క్: ప్రపంచపు అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్’ 100కోట్ల పై చిలుకు సభ్యులతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా 200దేశాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడైంది. 2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్ ఆరేళ్లలో 50 కోట్ల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే అంతుకు రెట్టింపు స్థాయికి ఎదిగింది. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారిలో 22 సంవత్సరాల వయస్కలు అధికం. బ్రెజిల్, ఇండియా, ఇండొనేషియా. మెక్సికో, అమెరకాలు దీనికి ఐదు అతిపెద్ద మార్కెట్లుగా పేరొందాయి. 60 కోట్ల మంది సభ్యులు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. 2012లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ 100 మిలియన్ల డాలర్లమేర స్పందనతో భారీ ఐపీవోల్లో ఒకటిగా నిలిచింది.

 

ఈ నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు అత్యధికంగా ఉన్న టాప్ -10 దేశాలు, ఆ దేశ ఫేస్‌బుక్ యూజర్లు సంఖ్య(10.09.2012వరకు)ను.. చెక్ ఫేస్‌బుక్ డాట్‌కామ్‌లో పొందుపరిచిన గణంకాలు ఆధారంగా మీకు అందిస్తున్నాం.

1.) యునైటెడ్ స్టేట్స్ (United States): యూజర్‌ల సంఖ్య 167,913,500.

2.) బ్రెజిల్ ( Brazil): సంఖ్య 59,693,400.

3.) ఇండియా (india): యూజర్ల సంఖ్య 59,399,300,

4.) ఇండోనేషియా (indonesia): యూజర్ల సంఖ్య 49,736,700,

5.) మెక్సికో (Mexico): యూజర్ల సంఖ్య 38,797,900,

6.) యునైటెడ్ కింగ్ డమ్: యూజర్ల సంఖ్య 33,017,380,

7.) టర్కీ : యూజర్ల సంఖ్య 31,492,780,

8.) ఫిలిప్పిన్స్: యూజర్ల సంఖ్య 29,860,260,

9.) ఫ్రాన్స్: యూజర్ల సంఖ్య 25,338,840,

10.) జర్మనీ : యూజర్ల సంఖ్య 24,813,320.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X