వ్యామోహం అదుపుతప్పితే..

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం (ఇంటర్నెట్) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా నేటి ఇ-తరం ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికి తెలుసు.

ఈ నేపధ్యంలో పలువురు తల్లిదండ్రులను అనేక ప్రశ్నలు? వేధిస్తున్నాయి!, తమతమ చిన్నారులకు కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ వ్యవస్థను ఏ వయసు నుంచి అందుబాటులో ఉంచాలి..?, చిన్నతనంలోనే వారిని ఇంటర్నెట్‌కు చేరువచేయడం వల్ల లాభమా నష్టమా..? అసలు చిన్నారులకు ఇంటర్నెట్ అవసరమా..? ఇలా అనేక ప్రశ్నలు వారిలో ఉదయిస్తున్నాయి.

వాస్తవానికి, పూర్తిస్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారివారి చిన్నారులకు చేరువచేసినట్లయితే వారి పై అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు.

ఇంటర్నెట్ దుర్వినియోగానికి దారితీస్తోన్న 10 అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోర్న్ వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌ను శాసిస్తున్నాయి. పలువురి యువతను భానిసలుగా మార్చి వారి లక్ష్యాలను పక్కదారి పట్టించటంలో వీటి పాత్ర ఏంతో ఉంది. ఈ సంస్కృతి సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు.

ఇంటర్నెట్ వేదికగా చిన్నారుల పై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నికలీ వాణిజ్య ప్రకటలు మోసపూరిత హామీలతో నెటిజనులను నిలువునా దోచుకుంటున్నాయి.  

ఇంటర్నెట్ లోని పలు లొసుగులను అడ్డంపెట్టుకున్న హ్యాకర్లు నెటిజనుల పై విరిచుకుపడి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. 

ఇంటర్నెట్ ను పూర్తిస్థాయిలో విశ్శసిస్తోన్న నెటిజనులు తమ వ్యక్తిగత సమాచారాన్ని సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు. పర్యావసానంగా ఇంటర్నెట్ చోరీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ చర్య ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. 

ఇంటర్నెట్ వినియోగం శృతిమించనంత వరకు ఓకే, పరిధి దాటితే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంటర్నెట్ వ్యసనం అటు మానసికంగా, ఇటు శారీరకంగా మనల్ని దెబ్బతీస్తుంది. 

ఇంటర్నెట్ పెరసీ రోజురోజు పెచ్చురిల్లుతోంది.

ఇంటర్నెట్ వ్యామోహంలో పడి యువత బోలెడంత విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. 

స్పామ్ మెయిల్స్ బెడత రోజురోజు బెంబేలెత్తిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Dangerous Ways Internet is Misused. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot