టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

Posted By:

వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. బోలెడన్ని సదుపాయాలు ఈ బ్రౌజర్ యాప్ లో ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న వేగవంతమైన వెబ్ బ్రౌజర్ లలో గూగుల్ క్రోమ్ ఒకటి. కోట్లాది మంది ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ బ్రౌజర్ సుపరిచితం. బ్రౌజింగ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత ఆధునికం చేస్తూ క్రోమ్ బ్రౌజర్ టెక్నాలజీ ప్రియులకు మరింత కిక్కునిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 గూగుల్ క్రోమ్ చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

ఈ క్రోమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకు తెలుసా

Ctrl బటన్ ను ప్రెస్ చేసి ఉంచి 1 నుంచి 8 లోపు ఏ నెంబరు బటన్ పై ప్రెస్ చేసినా ఆ సంఖ్యలో ఉన్న్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది.

Ctrl + 9 - చివరి ట్యాబ్‌లోకి వెళ్లటానికి
Ctrl + H - బ్రౌజర్ హిస్టరీని చూపిస్తుంది.
Ctrl + J - డౌన్‌లోడ్స్ విండో ఓపెన్ అవుతుంది.
Ctrl + K - కర్సర్‌ను అడ్రస్ బార్ లోకి తీసుకువెళుతుంది.
Ctrl + T - కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసేందుకు.

 

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

గూగుల్ ఓమ్నిబాక్స్ ద్వారా యూఆర్ఎల్ ఆధారిత శోధనే కాకుండా గణిత సంబంధిత గణాంకాలను కూడా నిర్వహించుకోవచ్చు.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

మీ క్రోమ్ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్, పాస్‌వర్డ్స్ అలానే బుక్‌మార్క్‌లను గూగుల్ అకౌంట్ కు సింక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వర్క్ అలానే హోమ్ కంప్యూటర్ ను సలువుగా మేనేజ్ చేయవచ్చు.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

తరచుగా ఓపెన్ చేసే ట్యాబ్‌లను పిన్ చేసుకోవచ్చు. నచ్చిన ట్యాబ్ లను పిన్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన యాక్సిస్ ను ఆస్వాదించవచ్చు.
ట్యాబ్ ను పిన్ చేసేందుకు ట్యాబ్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసినట్లయితే పలు ఆప్షన్ లతో కూడిన మెనూ ప్రతక్ష్యమవుతుంది. వాటిలో Pin Tab ఆప్షన్ ను ఎంపిక చేసుకునంటే సరి.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

ఆటో ఫిల్ ఫీచర్‌ను ఉపయోగించుకోండి

క్రోమ్ ఆటో ఫిల్ ఫీచర్, ప్రతిసారి మీరు నింపే ఆన్ లైన్ ఫామ్ లకు సంబంధించి సాధారణ ఖాళీలను ఈ ఆటో ఫిల్ ఫీచర్ నింపేస్తుంది. ఆటో ఫిల్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, Show advanced settingsను క్లిక్ చేసి Passwords and forms విభాగంలో కనిపించే Manage Autofill settingsను క్లిక్ చేసినట్లయితే ఆటోఫిల్ సెట్టింగ్స్ విండో ఓపన్ అవుతుంది. ఈ విండోలోని Add new street address బటన్ ను క్లిక్ చేసినట్లయితే ఓ అడ్రస్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వివరాలను పూరించి అడ్రస్ సెట్టింగ్స్ సేవ్ చేయండి. ఆటో ఫిల్ ఫీచర్ యాక్టివేట్ అయినట్టే.

 

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

క్రోమ్ బ్రౌజర్‌లో టెక్స్ట్ బాక్సులను రీసైజ్ చేసుకోవచ్చు.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

క్రోమ్ బ్రౌజర్‌లో ట్యాబ్‌ను వేగంగా క్లోజ్ చేసేందుకు

కీబోర్డ్ షార్ట్‌కట్స్ Ctrl + W లేదా Ctrl + F4

 

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో అందుబాటులోన్న మరో ఎక్స్‌టెన్షన్ ‘అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్'. ఈ ఫీచర్ ద్వారా మన ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగిపోతున్న వారి జాబితాను తెలుసుకునే వీలుంది.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

పటిష్టమైన పాస్‌వర్డ్ కోసం ‘లాస్ట్ పాస్': గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న లాస్ట్‌పాస్ ఎక్స్‌టెన్షన్ తికమక పెట్టే గ్రామర్‌తో శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను తయారు చేస్తుంది.

టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్

alt+m - new message
alt+0 - help center
alt+1 - homepage
alt+ 2- profile page
alt+3 - manage friends list
alt+4 - messages list
alt+5 - notification page
alt+6 - account settings
alt+5 - notification page
alt+6 - account settings
alt+7 - privacy settings
alt+8 - facebook fan page
alt+9 - facebook terms
alt+? - search box

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Google Chrome tips. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot