Home
News

ఇండియాలో టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఇవే

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు.

ఇండియాలో టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ ఇవే

షాపింగ్ దగ్గర్నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతి ఒక్క పనిని Mobile Wallets ద్వారా చేపడుతున్నారు. మరి ఇప్పుడు ఇండియాలో ఏయో Mobile Wallets ఉన్నాయి. వాటిని ప్రవేశపెట్టింది ఎవరు ఇలాంటి అంశాలను ఈ శీర్షికలో భాగంగా తెలుసుకుందాం.

 పేటీఎం

పేటీఎం

ఇండియాలో అత్యంత పెద్ద మార్కెట్ పేటీఎం సొంతం. ఈ యాప్ ద్వారా యూజర్లు మనీ స్టోర్ చేసుకోవడం అలాగే క్విక్ పేమెంట్లు చెల్లించడం వంటి పనులు చేయవచ్చు. 2010లో దీన్ని లాంచ్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 10 కోట్ల మంది ఇప్పటికే దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.

అమెజాన్ పే

అమెజాన్ పే

ఇది అమెరికాకు చెందిన అమెజాన్ ద్వారా నడపబడుతున్న మొబైల్ వాలెట్. నగదు చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌పే' ద్వారా విద్యుత్తు, ల్యాండ్‌ఫోన్‌, మొబైల్‌ పోస్ట్‌పెయిడ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, గ్యాస్‌ వంటి బిల్లులు చెల్లించవచ్చు. మొబైల్‌-డీటీహెచ్‌ రీఛార్జులు, రవాణాకు, సినిమా టికెట్ల బుకింగ్‌ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే 100కు పైగా సంస్థలు అమెజాన్‌లో నమోదయ్యాయి. బిల్లుల చెల్లింపునకు డెబిట్‌/క్రెడిట్‌కార్డులు, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, అమెజాన్‌ పే నిధులను వినియోగించుకోవచ్చు.

గూగుల్ పే

గూగుల్ పే

గూగుల్ రూపొందించిన డిజిటల్ వాలెట్ ఇది. ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, వాచెస్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఈ సర్వీస్ భారతదేశంతో పాటు 28 దేశాల్లో అందుబాటులో ఉంది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 10 కోట్ల మంది ఇప్పటికే దీన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.

 

 

ఫోన్‌పే

ఫోన్‌పే

డిజిటల్ లావాదేవీల విభాగ సేవలు అందిస్తున్న ఫోన్‌పే కూడా ఇప్పటి వరకు 200 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ప్రకటించింది. ప్రతియేటా కంపెనీ ప్లాట్‌ఫామ్ కింద 70 బిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ చేతిలో 30 లక్షల మంది మర్చెంట్లు, ప్రతి నెల లావాదేవీలు జరిపేవారు 5 కోట్ల మంది ఉండగా, ఈ సేవలు ప్రారంభించిన అతి కొద్ది కాలంలో 200 కోట్ల లావాదేవీలను పూర్తి చేసినట్లు ఫోన్‌పే వైస్-ప్రెసిడెంట్ కార్థిక్ రఘుపతి తెలిపారు. కంపెనీ యాప్ ద్వారా జరిపే లావాదేవీల్లో 75 శాతం ద్వి, తృతీయ శ్రేణి నగరాల నుంచి జరుగుతున్నాయి. నవంబర్ 2018లో 100 కోట్ల లావాదేవీలు దాటిన సంస్థ..మరో వంద కోట్లకు చేరుకోవడానికి కేవలం ఐదు నెలలు మాత్రమే పట్టింది. ప్రస్తుతం బోర్డులో 30 లక్షల మంది ఉండగా, వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.

మొబిక్విక్

మొబిక్విక్

దాదాపు 70 వేలకు పైగా రిటైల‌ర్స్ మొబిక్విక్‌ యాప్ ద్వారా సేవ‌లందిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి MOBIKWIKని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మొబిక్విక్ వ్యాలెట్ బుక్‌మైషో, మేక్‌మైట్రిప్‌, డోమినోస్ పిజ్జా, ఈబే వంటి వ్యాపార సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యాల‌ను కుదుర్చుకుంది. మొబిక్విక్ ట్యాగ్‌లైన్ దేశ్ కా వ్యాలెట్‌. అంటే దేశం మొత్తం ఈ వ్యాలెట్ ద్వారా న‌గ‌దు ర‌హితంగా మారాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం. మ‌నీ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసే విధానాన్ని మొబిక్విక్ సుల‌భ‌త‌రం చేసింది.

యోనో యాప్

యోనో యాప్

బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) దేశంలోనే పూర్తి స్థాయి డిజిటల్‌ సర్వీసు ఫ్లాట్‌ఫామ్‌ ‘యోనో' మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదల చేసింది. యోనో (యు నీడ్‌ ఓన్లీ వన్‌) పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో సేవింగ్‌ ఖాతా తెరవడం, రుణాలు పొందడం, అన్ని రకాల ఫైనాన్షియల్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను అందిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా 14 కేటగిరీల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, క్యాబ్‌ బుకింగ్స్‌ , వినోదం, డైనింగ్‌ అనుభవాలు, ట్రావెల్ అండ్‌ స్టే, వైద్యచెల్లింపుల వరకు యాప్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చని బ్యాంకు తెలిపింది. వినియోగదార్ల అవసరాలు తీర్చేందుకుగాను 60 ఇ-కామర్స్‌ కంపెనీలు (అమెజాన్‌, ఓలా, ఫ్లిప్‌కార్ట్‌, యాత్రా, స్విగ్గీ), పలు ఆఫ్‌లైన్‌ సంస్థలు తమతో భాగస్వామ్యం చేసుకున్నాయని ఎస్‌బిఐ ఛైర్మన్‌ రజ్నీష్‌ కుమార్‌ తెలిపారు.

యోనో ప్రత్యేకతలు

యోనోతో ఐదు నిమిషాల్లోపే ఎస్‌బిఐ ఖాతాలను డిజిటల్‌గా మార్చుకోవచ్చు.

కేవలం నాలుగు క్లిక్స్‌తో డబ్బు బదిలీ చేసుకోవచ్చు.

ముందుగానే వ్యక్తిగత రుణాలను కూడా పొందవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఓవర్‌డ్రాప్టు సదుపాయం ఉంది.

ఇది వాస్తవానికి డిజిటల్‌ బ్యాంకే అయినప్పటికీ., ఎస్‌బిఐలో భాగం గానే ఉంటుంది.

 

సిటీ మాస్టర్ పాస్

సిటీ మాస్టర్ పాస్

సిటి బ్యాంక్ ఇండియా , మాస్టర్ కార్డుల సంయుక్త భాగస్వామ్యంలో ఇండియాలో ఫస్ట్ గ్లోబల్ డిజిటల్ వ్యాలెట్ యాప్ Citi MasterPassని లాంచ్ చేశారు. దీని ద్వారా చెల్లింపులు , ఆన్ లైన్ షాపింగ్ వంటివి చేయవచ్చు.Citi Bank debit and credit card customers ఈ యాప్ ద్వారా మొత్తం రెండు లక్షలా యాభై వేల ఈ కామర్స్ వ్యాపారుల దగ్గర లావాదేవీలు జరుపవచ్చు.

ICICI Pockets

ICICI Pockets

ఇది ICICI బ్యాంకుకు సంబంధించిన మొబైల్ వాలెట్ యాప్ . ఈ బ్యాంకు ద్వారా ఏ బ్యాంకుకు అయినా నగదు బదలీ చేయవచ్చు. మనీ ట్రాన్సఫర్ recharge, book tickets, send gifts ఇంకా ఇతర లావాదేవీలను ఈ మొబైల్ వాలెట్ యాప్ నుండి చేయవచ్చు.

HDFC PayZapp

HDFC PayZapp

చెల్లింపులన్నింటినీ ఒకే వేదిక పైకి తీసుకువస్తూ హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ పేజాప్‌ పేరిట ఒక మొబైల్‌ అప్లికేషన్‌ ఆవిష్కరించింది. పే జాప్‌ సహాయంతో తమ డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు కస్టమర్లందరూ బ్యాంకుతో అనుసంధానం అయి ఒకే అప్లికేషన్‌ ద్వారా నిధుల బదిలీ, మొబైల్‌ రీచార్జ్‌, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ట్రావెల్‌ బుకింగ్‌లు, మూవీ టికెట్‌ బుకింగ్‌లు, ఆహారం, నిత్యావసర వస్తుసామగ్రి, మ్యూజిక్‌కు ఆర్డర్‌ చేయడం వంటి కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అంతేకాదు పే జాప్‌ సహాయంతో తమ కస్టమర్లు బీమా ఉత్పత్తుల కొనుగోలు, రుణదరఖాస్తు లు చేసుకోవడం వంటి కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పేజాప్‌ ద్వారా లావాదేవీల కోసం క్లియర్‌ట్రిప్‌, ఫ్లిప్‌కార్ట్‌, పివిఆర్‌, బుక్‌ మై షో, ఇండి గో వంటి కంపెనీలు హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

BHIM Axis Pay

BHIM Axis Pay

ఇదొక UPI banking app. దీని ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ ను మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే చేయవచ్చు. అలాగే ఇతర రకాల పేమెంట్లను కూడా దీన్నుంచే చేయవచ్చు. ఆండ్రాయిడ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దాదాపు కోటి మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు.

Best Mobiles in India

English summary
Top 10 Mobile Wallets In India – 2019 Edition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X