దూసుకుపోతున్న 10 Torrent వెబ్‌సైట్‌లు

ప్రపంచంలో ఏ మూలనైనా కొత్త సినిమా విడుదలైతే చాలు వెంటనే ఆ సినిమాకు సంబంధించి పైరసీ కాపీ టొరెంట్ సైట్‌లలో అందుబాటులోకి వచ్చేస్తోంది. టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేర్ చేయటమనేది చాలా దేశాల్లో చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు.

దూసుకుపోతున్న 10 Torrent వెబ్‌సైట్‌లు

Read More : పండక్కి రాబోతున్న 4 బ్లాక్‌‌బాస్టర్‌ ఫోన్‌లు

ఫైల్ షేరింగ్ అంటే కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సినిమా, మ్యూజిక్ ఇంకా ఫైల్స్‌ను యజమాని పర్మిషన్ లేకుండా షేర్ చేయటమనేది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. టొరెంట్ వెబ్‌సైట్‌ల పై ఉక్కుపాదం మోపేందుకు సైబర్ సెక్యూరిటీ సంస్ధలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికి ఇవి మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. KickassTorrents తరువాత అంతలా దూసుకుపోతున్న 10 Torrent వెబ్‌సైట్‌లు వివరాలను ఇప్పుదు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

THE PIRATE BAY

టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో THE PIRATE BAY ప్రస్తుతానికి రారాజుగా వెలుగొందుతోంది. తాజాగా వీడియో స్ట్రీమింగ్ సర్వీసును ఈ టొరెంట్ సైట్‌ లాంచ్ చేసినట్లు సమాచారం.

EXTRATORRENT

మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తున్న టొరెంట్ వెబ్‌సైట్‌ల జాబితాలో EXTRATORRENT సైట్‌ ఒకటి. ఈ సైట్ ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

 

RARBG

2008లో ప్రారంభమైన ఈ టొరెంట్ ప్రాజెక్ట్ 2015లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమాలతో పాటు టీవీ షోస్ ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి టాప్ 10 టొరెంట్ వెబ్‌సైట్‌ల జాబితాలో RARBG 3వ ప్లేసులో ఉంది.

YTS.AG

మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తున్న టొరెంట్ వెబ్‌సైట్‌ల జాబితాలో YTS.AG నాలుగవ స్ధానంలో ఉంది.

 

TORRENTZ2

టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో TORRENTZ2 ప్రాజెక్ట్ శక్తివంతమైన సెర్చ్ ఇంజిన్‌తో దూసుకుపోతోంది. Torrentz మూడబడిన తరువాత TORRENTZ2 ఇంటర్నట్ ప్రపంచంలోకి వచ్చింది.

1337X

టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో వేగవంతంగా విస్తరిస్తున్న వెబ్‌సైట్‌లలో 1337X ఒకటి. సెక్యూరిటీ సమస్యలను ఈ సైట్‌ను వేధిస్తున్పప్పటికి యూజర్ల తాకిడి మాత్రం తగ్గటం లేదు.

TORRENTPROJECT

TORRENTగా ఇంటర్నెట్ ప్రపంచానికి పరిచయమైన TORRENTPROJECT తన డేటాబేస్‌లో 10 మిలియన్లకు పై టొరెంట్ ఫైళ్లను కలిగి ఉంది.

EZTV.AG

టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో వేగవంతంగా విస్తరిస్తున్న వెబ్‌సైట్‌లలో EZTV.AG ప్రాజెక్ట్ ఒకటి.

TORRENTDOWNLOADS

చాలా దేశాల్లో TORRENTDOWNLOADS వెబ్‌సైట్‌ను బ్యాన్ చేసినప్పటికి క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.

LIMETORRENTS

టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో వేగవంతంగా విస్తరిస్తున్న వెబ్‌సైట్‌లలో LIMETORRENTS ప్రాజెక్ట్ ఒకటి. ఈ టొరెంట్ సైట్ iTorrents పేరుతో సరికొత్త క్యాచీ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పాఠకులకు ముఖ్యమైన గమనిక

Alexa ర్యాంకింగ్స్ ప్రకారం 2017కు గాను టొరెంట్ వెబ్‌సైట్‌ల విభాగంలో ఈ వెబ్‌సైట్‌లు మొదటి 10 స్దానాలను సొంతం చేసుకున్నాయి.

పాఠకులకు ముఖ్యమైన గమనిక : తెలుగు గిజ్‌బాట్ టొరెంట్ వెబ్‌సైట్‌లను ఏ మాత్రం ప్రోత్సహించదు. టొరెంట్ సైట్‌ల నుంచి ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయటమనేది చట్టవ్యతిరేక చర్య. అంతేకాకుండా టొరెంట్స్ ద్వారా పొందే ఫైళ్ల ద్వారా ప్రమాదకర వైరస్‌లు మీమీ ఫోన్‌లు అలానే కంప్యూటర్‌లలోకి చొరబడే ప్రమాదముంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most Popular Torrent Sites Of 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot