Home
News

భారీ మార్పులతో వస్తున్న గూగుల్, త్వరలో రాబోతున్న టాప్ ఫీచర్లు ఇవే

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన అప్లికేషన్లకు మరిన్ని అదనపు సౌలభ్యాలను జోడించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది.

By Hazarath Aiah

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన అప్లికేషన్లకు మరిన్ని అదనపు సౌలభ్యాలను జోడించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌లో తమ ఉత్పత్తులకు మరింత మెరుగులు, సరికొత్త సాంకేతికతను జోడిస్తూ పలు అప్‌డేట్స్‌ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఇందులో ఆండ్రాయిడ్‌ 'పి' వెర్షన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, జీమెయిల్‌, మ్యాప్స్‌ తదితర వాటిల్లో తీసుకురానున్న మార్పులను వెల్లడించింది. వీటితో పాటు ఇంకా ఇతర ఫీచర్లలోనూ భారీ మార్పులను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ తెస్తున్న మార్పులను ఓ సారి పరిశీలిస్తే..

ఆండ్రాయిడ్‌ ‘పి’

ఆండ్రాయిడ్‌ ‘పి’

ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో సంచలనం రేకెత్తించిన గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌ ‘పి'ని తీసుకురాబోతోంది. మార్చిలోనే డెవలపర్‌ ప్రివ్యూ విడుదల చేసినప్పటికీ ఈ కార్యక్రమంలో బీటా వెర్షన్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ సారి కేవలం పిక్సెల్‌ ఫోన్లకు మాత్రమే కాకుండా సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్‌ జడ్‌2, షియోమీ ఎంఐ మిక్స్‌ 2ఎస్‌, నోకియా 7 ప్లస్‌, ఒప్పో ఆర్‌15 ప్రొ, వివో ఎక్స్‌ 21, వన్‌ప్లస్‌ 6 మోడళ్లకు కూడా కొత్త వెర్షన్‌ అందుబాటులోకి రానుంది.

అడాప్టివ్‌ బ్యాటరీ

అడాప్టివ్‌ బ్యాటరీ

కొత్త వెర్షన్‌లో బ్యాటరీ వినియోగంపై గూగుల్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘అడాప్టివ్‌ బ్యాటరీ' అనే ఫీచర్‌ను అందిస్తోంది. అంతేకాదు ‘అడాప్టివ్‌ బ్రైట్‌ నెస్'లోనూ స్వల్పమార్పులు చేసింది. కొత్త డ్యాష్‌బోర్డు ఫీచర్‌ను ఉపయోగించి ఏ అప్లికేషన్‌ ఎంత సమయం వినియోగిస్తున్నామో తెలుసుకోవచ్చు.

మ్యాప్స్‌

మ్యాప్స్‌

ఈ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు తీసుకొస్తున్న గూగుల్ ఈసారి విజువల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ను జోడించింది. మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ మీరు ఆ ప్రాంతాన్ని మీ ఫోన్‌ కెమెరా ద్వారా మ్యాప్స్‌లో చూడటం ద్వారా మీరు ఎటు వెళ్లాలో అందుకు సంబంధించిన డైరెక్షన్స్‌ను ఫోన్‌ స్క్రీన్‌పైనే చూపిస్తుంది.

జీమెయిల్‌

జీమెయిల్‌

గూగుల్‌ తెస్తున్న కొత్త మార్పులతో జీమెయిల్‌లో మెయిల్స్‌ మరింత వేగంగా పంపించవచ్చు. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో స్మార్ట్‌ కంపోజర్‌ మరింత వేగంగా వినియోగదారులకు వాక్యాలను సూచిస్తూ పూర్తి చేస్తుంది.

గూగుల్‌ ఫొటోస్‌

గూగుల్‌ ఫొటోస్‌

ప్రస్తుతం ఉన్న ఫోటోలకు గూగుల్ మరిన్ని ఆసక్తికర ఫీచర్లను జోడించింది.ఓ ఫొటోలోని బ్యాగ్రౌండ్‌ని నలుపు తెలుపుల్లోకి మార్చడంతో పాటు నలుపు తెలుపులో ఉన్న ఫొటోలను కృత్రిమ మేథ సాయంతో రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యాన్ని అందించబోతోంది. ఇక దీంతో పాటు రొటేట్‌, బ్రైటెన్‌, షేర్ వంటి ఆప్షన్లను జోడిస్తోంది.

విండ్‌ డౌన్’ ఫీచర్‌

విండ్‌ డౌన్’ ఫీచర్‌

ఇక ‘విండ్‌ డౌన్' ఫీచర్‌ను ఉపయోగించి రాత్రి సమయాల్లో స్క్రీన్‌ని నలుపు తెలుపుల్లోకి మార్చుకోవచ్చు. దీంతో రాత్రి నిద్రించే ముందు ఫోన్‌ వినియోగం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ‌

గూగుల్‌ అసిస్టెంట్‌

గూగుల్‌ అసిస్టెంట్‌

ఇప్పుడు ప్రతి ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోనూ గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్ ఉంటుంది. అయితే గూగుల్ ఆరు కొత్త స్వరాలను ఈ ఫీచర్ కి జోడిస్తోంది. అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న ‘కన్‌టిన్యూయడ్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌' సాయంతో ఇక ప్రతిసారి ‘హే గూగుల్‌' అనాల్సిన అవసరం లేదు. అప్లికేషన్‌ డిజైన్‌ను సైతం మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

గూగుల్ డుప్లెక్స్

గూగుల్ డుప్లెక్స్

మీరు ఎక్కడికైనా వెళ్లి అపాయింట్ మెంట్ తీసుకునే పనిలేకుండా ఆ పని గూగుల్ చేసేలా ఈ కొత్త ఫీచర్ రానుంది. మీ బదులు అదే ఫోన్లో మాట్లాడి.. అపాయింట్మెంట్ తీసుకుని మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ‘గూగుల్' ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గూగుల్ డుప్లెక్స్' ప్రత్యేకత ఇది.

 అచ్చం మనిషి మాట్లాడుతున్నట్లే..

అచ్చం మనిషి మాట్లాడుతున్నట్లే..

ఆ వాయిస్ ఇప్పుడు ‘గూగుల్ వాయిస్'లో వస్తున్న ‘రోబోటిక్' వాయిస్‌లా ఉండదు. అచ్చం మనిషి మాట్లాడుతున్నట్లే.. సరళమైన ఇంగ్లీషులో, వాడుక పదాలతో మాట్లాడుతుంది. హమ్(Hmm), ఒకే వంటి భావాలను పలికిస్తుంది. ఇది వినేవారు.. మనిషితోనే మాట్లాడుతున్నామని భావిస్తారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా..

గూగుల్ డుప్లెక్స్'గా పేరుతో డెవలప్ చేస్తున్న ఈ టెక్నాలజీ ‘గూగుల్ అసిస్టెంట్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. పిచాయి ఈ టెక్నాలజీని పరిచేయం చేస్తూ.. గూగుల్ అసిస్టెంట్‌కు సెలూన్, రెస్టారెంట్ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఆడియోలను వినిపించారు. ఇది వింటే సాధారణ వ్యక్తులు ఫోన్లో మాట్లాడినట్లే అనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
Google shows off major new features for Assistant, Android and more at I/O 2018 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X