మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

Posted By:

మీరు గొత కొన్ని సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా శ్యానోజెన్‌మోడ్ గురించి తెలిసే ఉంటుంది. శ్యానోజెన్‌మోడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. ఆండ్రాయిడ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన కాబడిన ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్‌ఫోన్‌లు అలానే టాబ్లెట్ పీసీలను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ విడుదల చేసే అధికారిక ఆండ్రాయిడ్ రిలీజ్‌లు ఆధారంగా ఈ ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అభివృద్థి చెందుతుంది. 5 మిలియన్ల యూజర్ బేస్‌తో శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ కమ్యూనిటీలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. శ్యానోజెన్‌మోడ్‌లోని 10 ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

వేగవంతమైన పనితీరు

శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల పనితీరును మరింతగా పెంచుతుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు శ్యానోజెన్‌మోడ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన పనితీరును ఆస్వాదిస్తారు.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

కస్టమేజేషన్స్

కస్టమేజేషన్ ఆప్షన్ శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తోంది. కస్టమేజేషన్ ఆప్షన్‌లకు సంబంధించి శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ యూజర్లను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

కొత్త ఫీచర్లు

రోజువారి కార్యకలాపాలకు ఉపయోగపడే అనేక సరికొత్త ఫీచర్లను శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంది.లాక్‌స్ర్కీన్ షార్ట్ కట్స్, క్విక్ టాగిల్స్, అడ్వాన్సుడ్ పవర్ మెనూ, ర్యామ్ బార్, రీసెంట్ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్విక్‌ లాంచ్ షార్ట్‌కట్స్ వంటి సదుపాయాలు ఆకట్టుకుంటాయి.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

యూజబిలిటీ ట్వీక్స్

శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు అనుగుణంగా చిన్నచిన్న సర్దుబాట్లను చేసుకోవచ్చు.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ అనుభూతులతో 

శ్యానోజెన్ మోడ్ ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్‌డేట్‌లను యూజర్లకు చేరువ చేస్తుంది.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

జీవితకాలం పొడిగింపు

గెలాక్సీ ఎస్ గురించి మీకు తెలిసే ఉంటుది. ఈ ఫోన్ ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ అప్‌డేట్‌ను అందుకోలేదు. ఈ పోన్‌తో సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్ననెక్సస్ ఎస్, ఐస్‌క్రీమ్ శాండ్విచ్ అలానే 4.1 జెల్లీబీన్ వర్షన్‌ల పై సలువుగా రన్ అవుతోంది.

ఈ క్రమంలో శ్యానోజెన్‌మోడ్ గెలాక్సీ ఎస్ యూజర్లకు చక్కటి పరిష్కారాన్నిచూపింది. ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంను తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా గెలాక్సీ ఎస్ యూజర్లు ఐస్‌క్రీమ్ శాండ్విచ్ అలానే జెల్లీబీన్ ఓఎస్‌లను రన్ చేసుకోగలుగుతున్నారు.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

ఇన్‌బుల్ట్ అప్లికేషన్‌లు

శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఓఎస్ అనేక ఇన్‌బుల్ట్ అప్లికేషన్‌లతో లభ్యమవుతోంది.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

ఆండ్రాయిడ్ అనుభూతులను ఆస్వాదించవచ్చు

ఉన్నతమైన ఆండ్రాయిడ్ అనుభూతులను శ్యానోజెన్ చేరువచేస్తుంది.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తే సమస్యలను నిపుణులు బృందం గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుంది.

 

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో శ్యానోజెన్‌మోడ్ ఉందా..?

కమ్యూనిటీ

శ్యానోజెన్ మోడ్ అత్యుత్తమ కమ్యూనిటీని కలిగి ఉంది. ఈ కమ్యూనిటీ శ్యానోజెన్ అభివృద్థిలో కీలక భూమిక పోషిస్తోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 reasons to install CyanogenMod on your Android device. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot