దుమ్ము దులుపుతున్న సోషల్ సైట్ ఏది..?

Written By:


సోషల్ మీడియా..సోషల్ మీడియా.. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకే ఒక పదం..కొత్త ప్రపంచానికి వారధిగా నిలుస్తూ వస్తోంది. వ్యాపార రంగంలో ఈ సోషల్ మీడియా అసమాన స్థాయిలో దూసుకుపోతుంది. ఇంతకు ఇప్పుడు ఏది అగ్రస్థానాన్ని అక్రమిస్తోంది. ఏది చివరన ఉంది ఓ లుక్కేద్దమా..

read more చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ బుక్

సోషల్ మీడియాలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న సైట్ ఫేస్ బుక్. అత్యధిక మంది యూజర్స్ ని కలిగి ఉన్న సైట్ కూడా ఇదే. దాదాపు 1 మిలియన్ పైగానే చిన్న పెద్ద కంపెనీలు ఫేస్ బుక్ ప్రకటనలకు సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.

ట్టిట్టర్

పదాలను అందంగా ట్వీట్ చేయడంలో ట్విట్టర్ మేటి. ఇది సోషల్ మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది దాదాపు 81 పర్సంట్ ఆదాయం యాడ్స్ ద్వారా ట్విట్టర్ కు వస్తోంది.

లింక్డ్ ఇన్

ఈ సోషల్ మీడియా ప్రొఫెషనల్స్ నెట్ వర్క్..ప్రపంచ వ్యాప్తంగా ఇదే అతి పెద్ద ప్రొపెషనల్ నెట్ వర్క్. ఇప్పటి వరకు దాదాపు 332 మిలియన్ల యూజర్లను కలిగి వ్యాపారులను ఆకర్షిస్తోంది.

గూగుల్ ప్లస్

నెలకు 300 మిలలియన్ల యూజర్లు గూగుల్ ప్లస్ ను బిజినెస్ సంబంధాల కోసం వాడుకుంటున్నారు. 53 శాతం గూగుల్ ప్లస్, బ్రాండ్ ల మధ్య పరస్పర సంబంధం ఉంది.

యూ ట్యూబ్

2016 సంవత్సరంలో గూగుల్ 5.6 బిలియన్ నికర ఆదాయం ఆర్జించింది. నెలకు 6 బిలియన్ల గంటలసేపు యూ ట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారు. అలాగే ముబైల్ లో రోజుకు 1 బిలియన్ గంటలసేపు వీక్షిస్తున్నారు.

పిన్ టెరెస్ట్

పిన్ టెరెస్ట సోషల్ మీడియాలో భాగమే. బ్రాండ్స్ వేగంగా పెరిగేందుకు ఇది సహయపడుతోంది. ఈ సైట్ కు 70 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఇందులో 84 పర్సంట్ ఉమెన్స్,50 పర్సంట్ మెన్స్ ఉన్నారు. ఫేస్ బుక్ ద్వారా 9 మిలియన్ల మంది కనక్ట్ అవుతున్నారు.

ఇన్ స్టా గ్రాం

మార్కె ట్లో ఉత్పత్తులకు ఇన్ స్టా గ్రాం బాగా ఉపయోగ పడుతోంది. విజువల్ స్టోరిస్ కు ఇది ఓ మంచి ఫ్లాట్ ఫాం లాంటిది. నెలకు 300 మిలియన్ మంది యూజర్స్ ఇందులో యాక్టివ్ అవుతున్నారు. ప్రతి రోజూ 75 మిలియన్ల మంది యాక్టివ్ అవుతున్నారు.

తంబ్లర్

ఇది మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం. దీని ద్వారా ఫోటోస్,వీడియోస్, ఆడియోస్,కోట్స్,టెక్ట్స్ లాంటివి పంపుకోవచ్చు. ఈ సైట్ కు 420 మిలియన్ల కు పైగానే యూజర్లు,217 మిలియన్ల బ్లాగ్ లను క్రియేట్ చేసుకున్నారు.

ఫ్లికర్

ఈ సైట్ ద్వారా ఫోటోలు,వీడియోస్ పంపుకొవచ్చు. రోజుకు 3.5 మిలియన్ల ఫోటోలు అప్ లోడ్ అవుతున్నాయి.

రిడ్డిట్

ఈ సైట్ ఎంటర్ టైన్ మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. నెలకు 174మిలియన్ల మంది ఈ సైట్ ను వీక్షిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Interesting Statistics for the Top 10 Social Media Sites.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting