నోకియా నుంచి ఫేస్‌బుక్ వరకు, 2016లో కొనుగోళ్లు ఇవే!

టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కంపెనీ కొనుగోలుకు సంబంధించి చర్చలు సాగుతూనే ఉంటాయి. వాట్స్యాప్, ఇన్‌స్టాగ్రామ్, స్కైప్, టంబ్లర్, యూట్యూబ్, పేపాల్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు కొన్ని వందల కోట్లు గుమ్మరించి వీటిని సొంతం చేసుకున్నాయి. 2016కుగాను టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న 10 ఖరీదైన కొనుగోళ్ల వివరాలను మీ ముందుంచుతున్నాం....

Read More : ఫోన్ ప్రాసెసర్స్ గురించి పూర్తి సమాచారం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా, HMD Global డీల్

నోకియా తన మొబైల్ ఫోన్ డివిజన్‌ను 2014లో మైక్రోసాఫ్ట్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. నోకియా మొబైల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో కలిసిరాక పోవటంతో మైక్రోసాఫ్ట్, నోకియా మొబైల్ డివిజన్ ను మే 2016లో అమ్మకానికి పెట్టింది. తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఫిన్‌ల్యాండ్‌‌కు చెందిన HMD Global నోకియా మొబైల్ బ్రాండ్ హక్కులను సొంతం చేసుకుంది. డీల్ విలువ 350 మిలియన్ డాలర్లు. డిసెంబర్ 2016 నాటికి డీల్ పూర్తవుతుంది. నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను HMD Global 2017 నుంచి మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లీఇకో కూల్‌ప్యాడ్ డీల్

లీఇకో, కూల్‌ప్యాడ్ ఈ రెండు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లే. జూన్ 2016లో కూల్‌ప్యాడ్ వద్ద నుంచి షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలో 18శాతం షేర్లు, రెండవ విడతలో 11శాతం షేర్లను లీఇకో, కూల్‌ప్యాడ్ వద్ద నుంచి కొనుగోలు చేసింది. మొత్తం డీల్ విలువ 488 మిలయన్ డాలర్లు అని తెలుస్తోంది.

మైక్రోసాప్ట్ చేతికి లింకిడిన్

జూలై 11, 2016న చోటుల చేసుచేసుకున్న మరొక డీల్‌లో భాగంగా సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింకిడిన్‌ను రెడ్మండ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. డీల్ విలువ26.2 బిలియన్ డాలర్లు.

లాగీటెక్ - జేబర్డ్ డీల్

కంప్యూటర్ ఉపకరణాలతో పాటు బ్లుటూత్ స్పీకర్లను తయారు చేసే ప్రముఖ యాక్సెసరీస్ తయారీ కంపెనీ జేబర్డ్‌ను లాగీటెక్ కంపెనీ వ్యూహాత్మకంగా కొనుగోల చేసింది. డీల్ విలువ 50 మిలియన్ డాలర్లు.

వెరిజోన్ యాహూ డీల్

జూలై 22, 2016న చోటుచేసుకున్న మరో డీల్‌లో భాగంగా ప్రముఖ సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీ వెరిజోన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహూను కొనుగోలు చేసింది. డీల్ విలువ 4.82 బిలియన్ డాలర్లు.

సామ్‌సంగ్, హార్మాన్ డీల్

2016లో చోటుచేసుకున్న మరో టెక్నాలజీ డీల్ లో భాగంగా దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్, అమెరికాకు చెందిన ఆడియో కంపెనీ Harmanను 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేేసింది.

ఫేస్‌బుక్, MSQRD డీల్..

స్నాప్‌చాట్‌ను కొనుగోలు చేయటంలో పూర్తిగా విఫలమైన ఫేస్‌బుక్ ఈ ఏడాది మాత్రం Masqueradeను విజయవంతగా కొనుగోలు చేయగలిగింది. ఫేస్ స్వాపింగ్ అప్లికేషన్ అయిన Masqueradeను క్లుప్తంగా MSQRD అని పిలుస్తారు. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

ఫిట్‌బిట్ పెబ్బిల్‌ డీల్..

2016లో చోటు చేసుకున్న మరో టెక్నాలజీ డీల్‌లో భాగంగా ఫిట్నెస్ ట్రాకర్ కంపెనీ ఫిట్‌బిట్, మోడ్రన్ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ పెబ్బిల్‌ను కొనుగోలు చేసేంది. డీల్ విలువ40 మిలియన్ డాలర్లు.

స్నాప్‌చాట్ Vurb డీల్..

ఆగస్టు 2016లో చోటు చేసుకున్న మరో డీల్‌లో భాగంగా ప్రముఖ ఇమేజ్ షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ Vurb అనే ఇంటర్నెట్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ విలువ 100 మిలియన్ డాలర్లు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Tech Acquisitions That Took Place in 2016. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot