రోజు రోజుకు విస్తరిస్తోన్న టెక్నాలజీ ఎంత వరకు శ్రేయస్కరం..?, టెక్నాలజీ వల్ల ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. సాంకేతికత మనిషి జీవన శైలిని మరింత సులభతరం చేయటంతో మానవ సంబంధాల మంటగలిసిపోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో ప్రముఖ టెక్నాలజీల వివిధ ప్రభుత్వాలు విధించిన బ్యాన్ లను మీకు పరిచయం చేస్తున్నాం..
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల పై నిషేధం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలానే సౌదీఅరేబియా ప్రభుత్వాలు తమ దేశంలో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల నుంచి పంపించే ఈమెయిల్స్ అలానే ఇన్‌స్టెంట్ మెసెజ్‌ల పై దేశ భద్రత రిత్యా 2010లో నిషేధం విధించవల్సి వచ్చింది.
ఫేస్‌బుక్ పై నిషేధం
ముస్లీం సోదరుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని పోస్టులు ప్రచురితమవుతున్నాయంటూ పాకిస్థాన్ ప్రభుత్వం
ఫేస్‌బుక్ పై బ్యాన్ విధించాల్సి వచ్చింది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో లేజర్ పాయింటర్‌లను బ్యాన్ చేసింది.
యూఎస్‌లోని 34 శాతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మ్యూజిక్ ఫైల్ ట్రేడింగ్ ప్రోగ్రామ్ నాప్‌స్టర్ పై బ్యాన్ విధించాయి.
ఇజ్రాయిల్ ప్రభుత్వం ఐప్యాడ్‌లను బ్లాక్ చేయవల్సి వచ్చింది.
క్యూబా ప్రభుత్వం వ్యక్తిగత సెల్‌ఫోన్‌ల పై బ్యాన్ విధించాల్సి వచ్చింది.
గూగుల్ స్ట్ర్రీట్ వ్యూ పై బ్యాన్
తమ దేశ ప్రైవసీకి సంబంధించి విఘాతం ఏర్పడతుదంటూ గ్రీస్ ఇంకా ఆస్ట్రియా ప్రభుత్వాలు గూగుల్ స్ట్ర్రీట్ వ్యూను 2009లో బ్యాన్ చేసాయి.
పలు సెక్సీ అప్లికేషన్‌ల పై యాపిల్ బ్యాన్ విధించింది.