భారత్ కోసం గూగుల్, 10 ఆసక్తికర విషయాలు

Posted By:

గూగుల్ ఇండియాలో గూగుల్ ఫర్ ఇండియా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే. ఈ కార్యక్రమంలో గూగుల్ తన భవిష్యత్ ప్రణాళికలను, అలాగే కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇంటర్నెట్ వాడకాన్ని మరింతగా పెంచుతామని, ఇండియాలో డేటా వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగా 10 ఆసక్తికర విషయాలను గూగుల్ తెలిపింది.

ఆల్ టైం రికార్డు సెట్ చేసిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

On India's importance for Google

ఇండియాకు గూగుల్ అన్ని రకాల సదుపాయాలను తీసుకువచ్చింది. రానున్న కాలంలో ప్రతి భారతీయుడు ఇంటర్నెట్ వాడేవిధంగా గూగుల్ ముందుకు దూసుకువెళుతుందని తెలిపింది. ఇంటర్నెట్ ప్రపంచానికి దూరంగా ఉన్న గ్రామాలను కూడా అనుసంధానం చేస్తామని తెలిపింది.

Internet usage in India

ఇండియాలో ఇప్పటికే 400 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 330 మిలియన్ మంది స్మార్ట్‌ఫోన్ మీద డేటా వాడే యూజర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు నెలకి 4 జిబి డేటా మాత్రమే వీరు వాడుతున్నారని రానున్న నాలుగేళ్లలో దీనిని 11 జిబికి పెరిగే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.

Internet for Every Indian

230 మిలియన్ల మంది డిజిటల్‌తో కనెక్ట్ అయి ఉన్నారని, అలాగే అంతేమంది లాంగ్వేజ్ యూజర్లు ఉన్నారని గూగుల్ తెలిపింది.

Multilingual needs

క్రోమ్ ద్వారా 9 భాషల ట్రాన్స్ లేట్ ఇండియాలో చేసుకోవచ్చు. వాయిస్ సపోర్ట్ 9 భాషల్లో ఉంది. 22 భాషల్లో టెక్ట్స్ ఇన్ పుట్ ఉందని గూగుల్ తెలిపింది. కాగా కొత్తగా Bagheli, Bagri, Marwari, Tulu, Bishnupriya Manipuri, Haryanvi, Bhojpuri, Chhattisgarhi, and Mewari వీటిని కూడా చేరుస్తామని గూగుల్ తెలిపింది.

Solve for India

Solve for India పేరుతో చిన్నతరహా బిజినెస్ లు , స్టార్టప్ లు రానున్నాయని ఇందులో ఎవరైనా భాగస్వామ్యం కావచ్చని గూగుల్ తెలిపింది.

Google FREND

ఈ కార్యక్రమంలో గూగుల్ Google FREND పేరుతో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ టెక్నాలజీని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

Google RailWire

అన్ని చోట్లా గూగుల్ వైఫై హాట్ స్పాట్ లను ప్రవేశపెట్టేందుకు గూగుల్ కృషి చేస్తోంది.

Google Tez

ఈ ఫీచర్ ద్వారా మీరు మీ పేమెంట్లను మరింత సులభంగా చేసుకోవచ్చు. 12 మిలియన్ల మంది ఇప్పటికీ దీనిమీద యాక్టివ్‌గా ఉన్నారని తెలిపింది.

Android Oreo (Go Edition)

ప్రతి చిన్న ఫోన్‌కి కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ రానున్న కాలంలో గూగుల్ తీసుకువచ్చేందుకు ఈ ఫీచర్‌ని రిలీజ్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 things Google revealed in India special event and some of the announcements may surprise you! More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot