మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

Written By:

వీడియో స్ట్రీమింగ్ యాప్స్ విభాగంలో యూట్యూబ్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీడియోల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వెబ్‌సైట్‌లో కోట్ల సంఖ్యలో వీడియోలు కనువిందు చేస్తున్నాయి.

మీ ఆండ్రాయిడ్  ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

ఇంటర్నెట్ ప్రపంచం వీడియోలను ఎక్కువుగా వీక్షించేందుకు ప్రాధాన్యత చూపుతోన్న నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. యూబ్యూట్ తరహాలోనే అనేక వీడియో స్ట్రీమింగ్ యాప్స్ మార్కెట్లోకి వచ్చేసాయి.

2015లో దుమ్మురేపిన 10 యూట్యూబ్ వీడియోలు

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వీడియోలను చేరువ చేయటంలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్న ఈ యాప్స్ యూట్యూబ్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌ల కోసం యూట్యూబ్ తరహాలోనే మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

స్టార్ సంస్థ‌కు సంబంధించిన అన్ని ఛానల్స్ ప్రసారాలను హాట్‌స్టార్ యాప్ ఉచితంగా అందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ కాబడుతోన్న యాప్‌లలో హాట్‌స్టార్ ఒకటి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

వేల కొద్ది సినిమాలు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన సినిమాలను  అద్దెకు తీసుకోవచ్చు. నెలవారీ చందా విధానం కూడా అందుబాటులో ఉంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

సోనీ సంస్థ‌కు సంబంధించిన అన్ని ఛానల్స్ ప్రసారాలను Sony Liv యాప్ ఉచితంగా అందిస్తోంది. నెలవారీ చందా విధానం కూడా అందుబాటులో ఉంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

ఈ యాప్ ద్వారా Eros సంస్థకు సంబంధించిన ప్రీమియమ్ సినిమాలను డబ్బు చెల్లించి. సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన ఈ యాప్ అందుబాటులో ఉంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

BoxTV యాప్ మీకు సినిమాలతో పాటు టీవీ షోలను ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా లిమిటెడ్ సంఖ్య వరకు సినిమాలను వీక్షించవచ్చు. సినిమాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవల్సి ఉంటుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

హంగామా. కామ్ అందిస్తోన్న స్వరీసులలో హంగామా మూవీస్ ఒకటి. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సినిమాలను వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవల్సి ఉంటుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

Hooq వీడియో స్ట్రీమింగ్ యాప్ భారత్‌ లో లభ్యమవుతోంది. వందల సంఖ్యలో హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సినిమాలను వీక్షించేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

ప్రపంచాన్ని శాసిస్తోన్న వీడియో స్ట్రీమింగ్ సర్వీసులలో యూట్యూబ్ ఒకటి. 100 కోట్ల పై చిలుకు వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉచితంగా వీక్షించవచ్చు. గూగుల్ తాజాగా గూగుల్ ప్లే మూవీస్ పేరుతో సరికొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఈ సర్వీసులో భాగంగా సినిమాలను సబ్ స్ర్కిప్షన్ ప్రాతిపదికన వీక్షించవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

NexGTV యాప్ పెద్ద సంఖ్యలో సినిమాలతో పాటు టీవీ షోలను ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ అందిస్తోన్న సబ్ స్క్రిప్షన్ సర్వీసును యాక్సెస్ చేసుకోవటం ద్వారా 100కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీక్షించవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్

ప్రముఖ వీడియో - ఆన్ - డిమాండ్ సర్వీసులలో Netflix ఒకటి. 40కు పైగా దేశాల్లో Netflix సేవలను విస్తరించి ఉన్నాయి. ఈ యాప్ త్వరలో భారత్‌కు రాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Video Streaming apps to Download on Your Android Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot