ధర రూ.30,000లోపు టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు.. వివరాలు
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తున్నప్పుడు చాలా అంశాలను బేరీజు వేసుకుంటాం. అందుబాటు ధర, ర్యామ్, అంతర్గత స్టోరేజీ, కెమెరా సహా అన్ని చూసి కొనుగోలు చేస్తాం. రూ.30,000 కంటే తక్కువ రేంజ్ కలిగిన ఫోన్లు ఎక్కువగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రేంజ్‌లో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో నిర్ణయించడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. రూ.30,000 రేంజ్‌లో కెమెరా ఫోన్ల కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ కథనం మీ కోసం.
వన్‌ప్లస్ నార్డ్ 2T 5G స్మార్ట్‌ఫోన్ 6.43 అంగుళాల అమోలెడ్ స్ర్కీన్, పుల్‌హెడ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. 90Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP సెకండ్రీ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999కు కొనుగోలు చేయవచ్చు.

షియోమీ రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటి 1080 SoCతో వస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 200MP శాంసంగ్ హెచ్‌పీఎక్స్ సెన్సార్, 8MP ఆల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో షూటర్ ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. 8GB ర్యామ్, 256 అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,499గా ఉంది.
గూగుల్ పిక్సల్ 6a స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.28,999 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్‌సర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 6.14 అంగుళాల పుల్‌హెడ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 12MP ప్రధాన కెమెరా మరియు 12MP ఆల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ మేజిక్ ఎరేజర్ ఫీచర్‌తో ఫోటోలో ఉన్న అనవసర వస్తువులను తొలగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది.
నథింగ్ ఫోన్1 స్మార్ట్‌ఫోన్ 8GB, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మిడ్‌రేంజ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 778+ ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయర్ 50MP కెమెరాలతో వస్తుంది. ప్రధాన కెమెరా సోనీ IMX766 ఆధారంగా పనిచేస్తుంది. నైట్‌మోడ్, సీన్ డిటెక్షన్‌తో ఫీచర్‌తో అందుబాటులో ఉంది. మరియు ముందు కెమెరా 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 4500mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoCతో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ ధర ప్రస్తుతం రూ.29,999గా ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 50MP OIS సపోర్ట్, 13MP ఆల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు మందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








