మీ చిన్నారులను జీనియస్‌లుగా మార్చే 5 ప్రత్యేక గాడ్జెట్‌లు!

Posted By:

ఈ పోటీ ప్రపంచంలో మీ చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదవులో కఠోర సాధన మాత్రమే సరిపోదు.విద్యతో కాలంతో పరిగెడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ టెక్నాలజీ, విద్యా వ్యవస్థ రూపరేఖలనే మార్చేసింది. మీ చిన్నారులు నేటి యాంత్రిక వ్యవస్థలో విజేతలుగా నిలవాలంటే వారి అభిరుచిలకు అనుగుణంగా తల్లిదండ్రులు వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా చదువుతో పాటు వృత్తిపరమైన కార్యకలాపాల్లోనూ విద్యార్థులను నిమగ్నం చేయాల్సి ఉంది. చిన్నారుల్లో విజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే 5 అత్యుత్తమ గాడ్జెట్ లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరానలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌పి ఇంక్ ఆడ్వాంటేజ్ ప్రింటర్

 హెచ్‌పి ఇంక్ ఆడ్వాంటేజ్ ప్రింటర్ (HP Ink Advantage Printer):

ఈ ప్రత్యేకమైన ప్రింటర్‌ను ఇంట్లో ఉంచడం వల్ల మీ చిన్నారుల హోమ్‌వర్క్ ఇంకా ప్రాజెక్టులకు సంబంధించిన పని వేగవంతంగా పూర్తి అవుతుంది. తద్వారా మీ చిన్నారులు ఎక్కువ సమయం చదువు పై శ్రద్ధ చూపించే అవకాశం ఉంది. ఈ ప్రింటర్ మీ ఇంట్లో ఉండటం వల్ల సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. హెచ్‌పి ఇంక్ ఆడ్వాంటేజ్ ప్రింటర్ కొనుగోలు పై రూ.449 విలువ చేసే హెచ్‌పి ఇంక్ ఆడ్వాంటేజ్ కాట్రిడ్జ్‌ను పొందవచ్చు. ఈ కాట్రిడ్జ్ 550 పేజీలను సలువుగా ప్రింట్ చేస్తుంది.

 

హెచ్‌పి పెవిలియన్ 23-ఎఫ్201 ఆల్-ఇన్-వన్ కంప్యూటర్

హెచ్‌పి పెవిలియన్ 23-ఎఫ్201 ఆల్-ఇన్-వన్ కంప్యూటర్(HP Pavilion 23-f201in All-in-One):

ప్రస్తుత ప్రోటీ ప్రపంచంలో చిన్నారులకు స్కూల్ స్థాయి నుంచి కంప్యూటర్ విద్య పట్ల అవగాహన పెంపొదించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. చిన్నారులకు ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు సౌకర్యంతమైన కంప్యూటిగ్‌ను చేరవచేస్తాయి. ఇవి ఆక్రమించే చోటు చాలా తక్కువ. ఇదే ఉద్దేశ్యంతో రూపొందించబడిన హెచ్‌పి పెవిలియన్ 23-ఎఫ్201 ఆల్-ఇన్-వన్ పీసీ చిన్నారుల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఫీచర్లు: 23 అంగుళాల హైడెఫినిషన్ టచ్ డిస్‌ప్లే, 1ట్యాబ్ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, ఇంటెల్ కెర్ ఐ3-3240, 3.3గిగాహెట్జ్ ప్రాసెసర్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ హెచ్77  చిప్‌సెట్, 4జీబి డీడీఆర్3 ర్యామ్ ధర రూ.58,990.

 

పెన్‌డ్రైవ్‌లు

పెన్‌డ్రైవ్‌లు (Pen Drives):

డేటా స్టోరేజ్ పరికరాల్లో ఒకటైన పెన్‌డ్రైవ్‌కు నేటి ఆధునిక కాలంలో మంచి గుర్తింపు ఉంది. పెన్‌డ్రైవ్ వినియోగం పట్ల ఇప్పటినుంచే మీ చిన్నారుల్లో అవగాహనను పెంపొందించటం వల్ల వారు విలువైన సమాచారాన్ని నిక్షిప్తంగా భద్రం చేయటం అలవాటు చేసుకుంటారు. మార్కెట్లో అనేక మోడళ్లలో పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి.

 

ఎంపీత్రీ ప్లేయర్లు

4.) ఎంపీత్రీ ప్లేయర్లు (MP3 Players):

చిన్నారులకు చదువు ఎంత ముఖ్యమో వినోదం కూడా అంతే ముఖ్యం. చిన్నారులు అమితంగా మ్యూజిక్‌ను ఇష్టపడుతుంటారు. ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్‌ను అందిస్తున్న ఎంపీత్రీ ప్లేయర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో బ్రాండెడ్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్‌ను మీ చిన్నారుల కోసం ఎంపిక చేయండి.

 

స్మార్ట్‌టీవీ

స్మార్ట్‌టీవీ (Smart TV):

మీ చిన్నారులు విజ్ఞానాన్ని పెంపొందించటంలో స్మార్ట్‌టీవీ అన్ని విధాలుగా తోడ్పడుతుంది. కంప్యూటింగ్, ఆన్‌లైన్ లెర్నింగ్, గేమింగ్ వంటి అంశాలను స్మార్ట్‌టీవీ ద్వారా నిర్వహించుకోవచ్చు. చిన్నారులకు అవసరమైన అంశాలను స్మార్ట్‌టీవీ ఆవిష్కరిస్తుంది. నేటి ఆధునిక వ్యవస్థలో మీ ఇంటికి స్మార్ట్‌టీవీ ఎంతో అవసరం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot