Home
News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌.. టాప్‌ 5 స్మార్ట్‌టీవీ డీల్స్‌.. పూర్తి వివరాలు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌ (Flipkart Big Billion Days 2025) ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ అర్ధరాత్రి నుంచి అందరూ ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరలతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎలక్ట్రానిక్‌ గ్యా్డ్జెట్స్‌, గృహోపకరణాల వరకు తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలను డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌ లో శాంసంగ్, షియోమీ సహా అనేక బ్రాండ్స్‌కు చెందిన స్మార్ట్‌టీవీలను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రూ.30 వేల ధరలో మంచి డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్న స్మార్ట్‌టీవీల (Flipkart Smart TV Deals) గురించి తెలుసుకుందాం.

Top 5 Smart TV deals on Flipkart Big Billion Days 2025 sale

శాంసంగ్‌ 43 అంగుళాల 4K ఇన్ఫినిటీ విజన్‌ TV :
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్ క్రిస్టల్‌ 4K ఇన్ఫినిటీ విజన్‌ 43 అంగుళాల అల్ట్రా HD టీవీ మోడల్‌ ధర రూ.24,990 గా ఉంది. ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై రూ.4,200 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా రూ.20,790 కే కొనుగోలు చేయవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా 9 నెలల వరకు నోకాస్ట్ EMI ఆప్షన్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్‌టీవీ 50Hz డిస్‌ప్లే, 20W స్పీకర్లతో మెరుగైన అనుభూతి పొందే విధంగా అవుట్‌పుట్‌ ఇస్తుందని శాంసంగ్‌ చెబుతోంది.

TCL అల్ట్రా HD 4K స్మార్ట్‌టీవీ :
టీసీఎల్‌ 50 అంగుళాల అల్ట్రా HD 4K TV స్మార్ట్‌టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.29,490 గా ఉంది. ICICI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై తగ్గింపుతో రూ.24,990 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ 60Hz డిస్‌ప్లే, 24W స్పీకర్, 2GB స్టోరేజీని కలిగి ఉంది.

55 అంగుళాల U65 అల్ట్రా HD 4K స్మార్ట్‌టీవీ :
ఈ సేల్‌లో భాగంగా IFFALCON U65 అల్ట్రా HD 4K LED 55 అంగుళాల స్మార్ట్‌ టీవీని రూ.22,999 కే కొనుగోలు చేయవచ్చు. ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.20499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ 60Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, UHD రిజల్యూషన్‌ డిస్‌ప్లే, 24W స్పీకర్లను కలిగి ఉంది.

సోనీ 32 అంగుళాల ఎల్‌ఈడీ గూగుల్ టీవీ :
తక్కువ ధరలో సోనీ టీవీ కోసం చూస్తుంటే ఈ స్మార్ట్‌ టీవీని మీరు పరిశీలించవచ్చు. డిస్కౌంట్‌లు, బ్యాంకు కార్డులతో రూ.22,499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ సోనీ స్మార్ట్‌టీవీ విజువల్‌, సౌండ్‌ పరంగా అత్యంత మెరుగైన అనుభూతిని అందిస్తుందని సోనీ చెబుతోంది.

షియోమీ అల్ట్రా HD LED టీవీ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌లో భాగంగా షియోమీ 43 అంగుళాల 4K అల్ట్రా HD ఎల్‌ఈడీ టీవీని రూ.19499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.17,549 కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 24W స్పీకర్లు, UHD రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Top 5 Smart TV deals on Flipkart Big Billion Days 2025 sale, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X