ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

Posted By:

నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో కొంచం కొత్తగా ఆలోచిస్తే చాలు స్వల్ప వ్యవధిలోనే ‘టాక్ ఆఫ్ ద టౌన్'గా మారిపోవచ్చు. ఆన్‌లైన్ ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆలోచనలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆన్‌లైన్ ఉపాధిమార్గంగా విస్తరిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించేందుకు 5 ఉత్తమ మార్గాలను మీకు పరిచయం చేస్తున్నాం....

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

స్వీయ పుస్తక ప్రచరణ (Self Publish Books):

కలంతో మంచి స్నేహం ఉందా..?, పుస్తకాలు రాయగలరా..? అయితే మీ కోసం అమోజాన్ సంస్థ ‘కైండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్' పేరతో ఉచిత సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మీరు రాసిన పుస్తకాన్ని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. మన దేశానికి చెందిన పలువురు రచయతలు ఈ తరహాలోనే ఆదాయన్ని అర్జిస్తున్నారు.

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

అప్లికేషన్‌లను తయారు చేసి విక్రయించండి (Make & Sell your Apps):

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలు వినియోగం రోజురోజుకు విస్తరిస్తుండటంతో అపిక్లేషన్ విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మీలో సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నట్లయితే విభిన్నంగా ఆలోచించి అప్లికేషన్‌ను రూపొందించండి. మీ ఆలోచన బాగునట్లయితే సదురు అప్లికేషన్ కాసులు వర్షం కురిపిస్తుంది.

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

ఆన్‌లైన్ ద్వారా పాత వస్తువులను విక్రయించండి (Sell Old Stuff Online):

డబ్బు సంపాదించేందుకు ఇదో సులువైన మార్గం. మీ చుట్టు పక్కల ఉన్న పాత వస్తువులను సేకరించండి. క్లిక్ డాట్ ఇన్, వోఎల్ఎక్స్ డాట్ ఇన్, క్వికర్ డాట్ కామ్ వంటి వెబ్‌సైట్‌లు ఉచిత క్లాసిఫైడ్ వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో మీరు ఓ ఖాతాను తెరిచి మీ చెంత ఉన్న పాత ఉత్పత్తులకు సంబంధించి వివరాలను పొందుపరచండి. ఆసక్తి ఉన్న వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

ఈ-ట్యూటరింగ్ (E-Tutoring):

శిక్షణా విభాగంలో మీకు అనుభవం ఉందా. ఏదైనా సబ్జెక్టును అనర్గళంగా బోధించగలరా..? అయితే మీకోసం www.2tion.net or www.tutorvista.com వంటి ఆన్‌లైన్ శిక్షణా వెబ్‌సైట్‌లు ఎదురుచూస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో మీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసినట్లయితే ధృవీకరణ అనంతరం ఔత్సాహికులు మీ సేవలను వినియోగించుకుంటారు. మీ నైపుణ్యం ఆధారంగా పారితోషకం ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

ఆన్‌లైన్ షాప్‌ను ప్రారంభించండి (Start an Online Shop):

మీలో హస్తకళా నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయా..? అయితే ఓ ఆన్‌లైన్ షాపును ప్రారంభించి మీరు డిజైన్ చేసిన వస్తువులను అమ్మకానికి ఉంచండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting