మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ High-Speed ఇంటర్నెట్ ప్యాక్స్

భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సేవలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. చాలా వరకు నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు మంచి రేట్లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్లో సిద్ధంగా ఉన్న 8 బెస్ట్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్యాక్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : Google Allo..ఇది వాట్సాప్‌ను మించిన యాప్ అవుతుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Act Extravagent

యాక్ట్ ఫైబర్‌నెట్, గతంలో బీమ్ పైబర్ పేరుతో సేవలందించిన ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ ప్రొవైడర్ ఆఫర్ చేస్తున్న కొత్త ప్లాన్‌లో భాగంగా 100 Mbps వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను రూ.1999కే అందిస్తోంది.

Airtel Broadband

టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ సరికొత్త హైస్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 40 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను రూ.2399కే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

YOU Broadband

YOU Broadband పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ 100 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను రూ.1724కే అందిస్తోంది.

Tikona Broadband Plans

మార్కెట్లో క్రమక్రమంగా తన పరిధిని విస్తరించుకుంటోన్న Tikona, 4 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో 90 జీబి ఇంటర్నెట్‌ను రూ.950కే అందిస్తోంది.

BSNL

ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL తన మార్కెట్ విస్తరణలో భాగంగా సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 100 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను రూ.16,999కే అందిస్తోంది.

Reliance Broadband

రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ 12 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన నెల ఇంటర్నెట్‌ను రూ.999కే అందిస్తోంది.

MTNL Broadband

ముంబై కేంద్రంగా సేవలందిస్తోన్న ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ 100 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను రూ.6,999కే అందిస్తోంది.

Airlink Desire Eco Unlimited Plan

ఈ లోకల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ 200 ఎంబీపీఎస్ గరిష్ట వేగంతో కూడిన సంవత్సరం ఇంటర్నెట్‌ను రూ.2,400కే అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 8 High-Speed Internet Packs Available in India Right Now. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot