భారీ మొత్తంలో వేతానలు తీసుకుంటున్న కంపెనీల డైరెక్టర్లు

Posted By: Super

భారీ మొత్తంలో వేతానలు తీసుకుంటున్న కంపెనీల డైరెక్టర్లు

అమెరికాకు చెందిన పలు కంపెనీల డైరెక్టర్లు గత ఏడాది భారీ మొత్తంలో వేతానలు తీసుకున్నారు. ఇంధనం, హెల్త్‌కేర్‌ రంగానికి చెందిన కంపెనీల డైరెక్టర్ల వేతనాలు సుమారు 13 శాతంపైనే పెరిగాయని సర్వేలో తేలింది. 2010లో అత్యధికంగా వేతనాలు పొందిన వారిలో టెక్నాలజీ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. 2009తో పోల్చుకుంటే హెల్త్‌కేర్‌ రంగానికి చెందిన కంపెనీ డైరెక్టర్ల వేతనాలు బాగా పెరిగాయి. 2010లో కంపెనీలకు చెందిన డైరెక్టర్ల వేతనాలు సరాసరి 7 శాతం చొప్పు పెరిగి 110,155 డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది 2009లో వారి వేతనాలు 102,809 డాలర్లుగా ఉండేది. సుమారు 600 కంపెనీలకు చెందిన కంపెనీల డైరెక్టర్ల వేతనాలపై అమెరికాకు చెందిన అకౌటింగ్‌ సంస్థ బీడీఓ సర్వే నిర్వహించింది.

వేతనాలు పెరగడానికి ప్రధాన కారణం అత్యంత నిపుణులైన వారికి మంచి డిమాండ్‌ ఉండటంతో పాటు... స్టాక్‌ మార్కెట్‌ కూడా తిరిగి కోలుకోవడంతో వీరికి కంపెనీలు అధిక మొత్తంలో జీతాలతో పాటు నగదు.. ఈక్విట్‌ షేర్లను, వాహనాలను కూడా అందజేస్తోంది. నైపుణ్యాన్ని బట్టి వేతనంతో పాటు.. కంపెనీలు బాగా అర్హతలున్న వారికి తమ బోర్డులోకి సభ్యులుగా చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారయని బీడీఓ డైరెక్టర్‌ (కాంపెన్‌సేషన్‌ అండ్‌ బెనిఫిట్‌ ప్రాక్టీస్‌) రాండీ రామిర్జి చెప్పారు.

టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్‌కేర్‌, రీటెయిల్‌ ఎక్టార్లకు చెందిన డైరెక్టర్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. ఈ రంగాలపై ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా కారణమే.. ఈరంగాల్లో నిపుణులకు మంచి డిమాండ్‌ ఉంది. ఇక మిగతా రంగాల విషయానికి వస్తే బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాలు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుని తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి.హెల్త్‌కేర్‌ రంగానికి చెందిన డైర్టెర్లకు 2009తో పోల్చుకుంటే సరాసరి 13.3 శాతం పెరుగుదలతో 137,601 డాలర్లకు చేరింది. టెక్‌ కంపెనీల విషయానికి వస్తే అత్యధికంగా 149,428 డాలర్లు 2009తో పోల్చుకుంటే 3.6 శాతం పెరిగింది.

ఎనర్జీ రంగానికి చెందిన డైరెక్టర్లు సరాసరి పే ప్యాకెట్‌ 139,930 డాలర్లు ఇంటికి తీసుకెళ్లారు 2009తో పోల్చుకుంటే 5.9 శాతం పెరుగుదలను సాధించింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంతో పాటు సర్వీస్‌ సెక్టార్‌కు చెందిన బోర్డు డైరెక్టర్లకు వరుసగా కేవలం 0.2 శాతం మాత్రమే పెరిగి సరాసరి 77,022 డాలర్లకు చేరగా... సర్వీసు రంగానికి చెందిన డైరక్టర్లకు 2 శాతంతో 50,824 డాలర్లకు చేరాయి. ఈ సర్వే మొత్తం 600 కంపెనీలపై సర్వే జరిపింది. వారి కంపెనీ రెవెన్యూ 25 మిలియన్‌ డాలర్ల నుంచి ఒక బిలియన్‌ డాలర్లు కాగా... ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన కంపెనీల రెవెన్యూ 2 బిలియన్‌ డాలర్లకు చేరింది. స్టాక్‌ మార్కెట్‌లు కోలుకోవడం వల్ల కంపెనీ డైరెక్టర్ల వేతనాలు పెరిగాయని సర్వే వెల్లడించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot