ఆ కంపెనీలో 6 నెలల సెలవు, జీతం కట్ చేయరు!

కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగమంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే!. పలు బహుళజాతీయ కంపెనీలు తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సహకాలతో పాటు ప్రయోజనాలను ఒకసారి పరిశీలించినట్లయితే, జీవితంలో ఒక్కసారైనా పనిచేయాలని మీరు ఫిక్స్ అయిపోతారు. ఏటా జీతాల పెంపు, హెల్త్ ఇన్స్యూరెన్స్, పెయిడ్ టైమ్ చెల్లింపు వంటి కొత్త కొత్త ప్రయోజనాలను నిత్యం అమలుపరుస్తూ ఉద్యోగులను ఆకట్టుకుంటోన్న పలు ఐటీ కంపెనీల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.10,000 రేంజ్‌లో 3జీబి ర్యామ్ ఫోన్స్ ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

గూగుల్ కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా మరణించినట్లయితే వారి వేతనంతో 50 శాతాన్ని 10 సంవత్సరాల పాటు ఏటా ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.6/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

ట్విట్టర్, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మూడు పూటల భోజనంతో ఇతరు ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. ట్విట్టర్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.3/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

ఫేస్‌బుక్, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పిల్లలు పుట్టినప్పుడు ‘బేబీ క్యాష్' స్కీమ్ క్రింద 4,000 డాలర్లను అందిస్తుంది. ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.7/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

సేల్స్‌ఫోర్స్ ఉద్యోగులు ఏడాదిలో 6 రోజుల పెయిడ్ వాలంటీర్ టైమ్‌ఆఫ్‌ను తీసుకోవచ్చు. ఈ 6 రోజులు సెలవు తీసుకున్నప్పటికి జీతంలో ఎటువంటి కోతలు ఉండవన్నమాట. సేల్స్‌ఫోర్స్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.5/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

అడోబ్ తమ కార్యాలయాన్ని వేసవి కాలంలో ఒక వారం. డిసెంబర్‌లో మరో వారం రోజుల పాటు పూర్తిగా మూసేస్తుంది. ఈ కంపెనీ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.6/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

స్పాటిఫై కంపెనీ, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు చెల్లింపు వేతనంతో కూడిన 6 నెలల పితృత్వ లీవ్ ను అందిస్తోంది. ఈ కంపెనీ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.2/5గా ఉంది.

 

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

ఎయిర్‌బిఎన్‌బి తమ ఉద్యోగులకు వార్షిక వేతనం క్రింద 2,000 డాలర్లను అందిస్తోంది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌బిఎన్‌బి లిస్టింగ్స్‌లో స్టే చేయవచ్చు. ఈ సంస్థ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4.6/5గా ఉంది.

ఆ కంపెనీల్లో నమ్మశక్యం కాని ప్రోత్సాహకాలు

అసెంచుర్ తమ ఉద్యోగులకు జెండర్ రీఅస్సైన్మెంట్‌ను కల్పిస్తోంది.ఈ కంపెనీ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న ప్రోత్సాహకాల రేటింగ్ 4/5గా ఉంది.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

గూగల్ కార్యాలయాల్లోని పనివాతవరణం స్వచ్చమైన ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒత్తడిని దరిచేరనివ్వదు. రోజు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు అక్కడి పనిచేసే ఉద్యోగులకు ఆధునిక యుగంలో ఉన్న అనుభూతిని చేరువ చేస్తాయి.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

గూగుల్ కార్యాలయల్లో నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు సహ ఉద్యోగులు సందేహాలను తీర్చటంలో పూర్తిస్థాయిలో స్పందిస్తారు.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటను కల్పిస్తోంది.

గూగుల్ తమ ఉద్యోగులకు కల్పిస్తోన్న పలు ఉచిత సౌకర్యాలు

గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top IT giants offered to employees big incredible perks. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot