ఆన్‌లైన్ ద్వారా కోర్సులను నేర్చుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్‌లు ఇవే

|

కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ప్రజలు ఇంటి నుండి పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నచ్చకో లేదా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలనే కోరికతోనే మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి లేదా కొత్త ఫీల్డ్‌ల గురించి సమాచారాన్ని పొందడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఉచిత కోర్సులను అందించే కొన్ని వెబ్‌సైట్‌లు చాలానే ఉన్నాయి. మీరు మీ కెరీర్‌ను మెరుగుపరచడానికి సహాయపడే వెబ్‌సైట్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Coursera

Coursera

కోర్సెరాను 2012లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్లు ప్రారంభించారు. ఇది 200 కంటే ఎక్కువ ప్రముఖ ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వీటిలో హాప్‌కిన్స్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, స్టాన్‌ఫోర్డ్, ఇంటెల్, గూగుల్, INSEAD, ISB మరియు కాల్టెక్ వంటి అనేక విద్యా మరియు పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఇది ఉచిత మరియు పేమెంట్ కోర్సులను అందిస్తుంది. వ్యక్తిగత కోర్సులు రూ.2,250-7,500, మరియు ప్రోగ్రామ్‌లు మరియు స్పెషలైజేషన్ కోర్సులు రూ. 2,250-6,000 నుండి ప్రారంభమవుతాయి. అయితే డిగ్రీ కోర్సులు రూ.11.2 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ 4,300 కోర్సులు, 320 ప్రాజెక్ట్‌లు, 440 స్పెషలైజేషన్‌లు, 30 సర్టిఫికెట్‌లు మరియు 20 రకాల డిగ్రీలను అందిస్తుంది. సబ్జెక్ట్‌లు డేటా సైన్స్, ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ మరియు హ్యుమానిటీ వరకు ఉంటాయి.

Edx

Edx

Edx అనేది విస్తారమైన ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు మరియు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్. హార్వర్డ్ మరియు MIT దీనిని 2012లో ప్రారంభించాయి. ఈ సైట్ హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, MIT, కార్నెల్ మరియు IBMతో సహా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మరియు హాంకాంగ్ పాలిటెక్నిక్‌లతో సహా 140 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థలతో అనుబంధంగా ఉంది. ఇది ఉచితంగా మరియు ఫీజులతో కూడిన కోర్సులను అందిస్తుంది. దీని యొక్క ఫీజు రూ.3,750 నుంచి రూ.22,500 వరకు ఉంటుంది. అయితే ఇది ఆర్కైవ్ చేసిన తరగతులకు సర్టిఫికేట్‌లను అందించదు. అయితే నిర్దిష్ట కోర్సులకు ధృవీకరించబడిన సర్టిఫికేట్లు అందుబాటులో ఉన్నాయి.

Apna Course

Apna Course

ఇది 2013లో ప్రొఫెషనల్ కోర్సులు మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లతో ప్రారంభమైన భారతీయ ఇ-ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్. వీడియో మరియు ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ వెబ్‌సైట్‌లో 27 ఉచిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇది నెలవారీ (రూ.150), అర్ధ-సంవత్సరానికి (రూ.800), మరియు వార్షిక చందా (రూ.1,500) కూడా అందుబాటులో ఉంది.

Code Academy

Code Academy

కోడ్ అకాడమీ అనేది 2011లో ప్రారంభమైన ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్. ఇది ఉచిత మరియు పేమెంట్ వెర్షన్‌లలో స్టోరీలు మరియు వీడియోలలో కోడింగ్ తరగతులను అందిస్తుంది. ఇందులో ఉచిత ఎంపికను బేసిక్ అంటారు. పెయిడ్ ప్లాన్‌లను ప్రో అంటారు. దీని ధర నెలకు రూ.1,199 లుగా ఉంటుంది. డిగ్రీ/సర్టిఫికేషన్ కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అందించబడుతుంది. ఇది 14 భాషల్లో కోడింగ్‌ను అందిస్తుంది. వీటిలో HTML మరియు CSS, పైథాన్, జావాస్క్రిప్ట్, జావా, SQL, బాష్/షెల్, రూబీ, C++, R, C#, PHP, Go, Swift మరియు Kotlin ఉన్నాయి. కోడ్ అకాడమీ వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, డెవలపర్ టూల్స్, మెషిన్ లెర్నింగ్, కోడ్ ఫౌండేషన్‌లు, వెబ్ డిజైన్, గేమ్ డెవలప్‌మెంట్, మొబైల్ డెవలప్‌మెంట్ మరియు డేటా విజువలైజేషన్ వంటి ఇతర సబ్జెక్టులలో కోర్సులను అందిస్తుంది.

Alison

Alison

Alison.com 2007లో ఉచిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభించబడింది. ఇది స్టాన్‌ఫోర్డ్, MIT, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ మరియు యేల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుండి ఉచిత కోర్సులను అందిస్తుంది. మీరు పేమెంట్ సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా సైట్ యొక్క ఇతర ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు. డిగ్రీ/సర్టిఫికేషన్‌తో పాటు ఇది సర్టిఫికేట్లు, డిప్లొమాలను కూడా అందిస్తుంది.

Edureka

Edureka

మీరు డెవలపర్ కావాలనుకుంటున్నారా? మీరు ప్రోగ్రామింగ్ లేదా వెబ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ చేయాలనుకుంటున్నారా? నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఈరోజు కంటే మంచి సమయం మరొకటి ఉండదు. అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఉపయోగకరమైన ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకోండి మరియు సర్టిఫికేషన్ కోర్సులతో బ్యాక్-ఎండ్ మరియు ఫ్రంట్-ఎండ్ వెబ్ టెక్నాలజీలలో మాస్టర్ అవ్వడానికి Edureka ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జావా, పైథాన్, పెర్ల్, రూబీ, Node.js మరియు మరిన్ని వంటి లెగసీ మరియు ట్రెండింగ్ టెక్నాలజీలలో కోర్సులను ఉచితంగా మరియు ఫీజులతో కూడిన కోర్సులను అందిస్తుంది..

Best Mobiles in India

English summary
Top Online Courses Websites That Can be Used For Free Certification

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X