ఐఫోన్5ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? ఇవిగోండి ఆన్‌లైన్ డీల్స్!

By Super
|
ఐఫోన్5ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? ఇవిగోండి ఆన్‌లైన్ డీల్స్!


టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ డివైజ్ ‘ఐఫోన్ 5’నవంబర్ 2(శుక్రవారం) నుంచి భారత రిటైల్ ఇంకా మోడ్రన్ మార్కెట్‌లలో అధికారికంగా లభ్యం కానుంది. ఈ వివరాలను ఆపిల్ ఐఫోన్ పంపిణీ భాగస్వామి అయిన ఐన్‌గ్రామ్ మైక్రో శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ధరకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం వెల్లడికాలేదు. ధర రూ.45,000కు పై చిలుకుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్5 విడుదల అధికారికమైన నేపధ్యంలో పలు ప్రముఖ ఆన్-లైన్ రిటైలర్లు ప్రీఆర్డర్ లకు ఆహ్వానిస్తున్నాయి. వాటిలో టాప్-5 డీల్స్...

 

ఈబే డాట్ ఇన్(eBay.in): ఈ రిటైలర్ ఐఫోన్5 అన్‌లాకుడ్ 16జీబి వర్సన్ ధరను రూ.55,900గా తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. 32జీబి వర్సన్ ధర రూ.70,990. లింక్ అడ్రస్:

ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (Infibeam.com): ఆపిల్ ఇండియా, ఐఫోన్5ను ఈ నెల 26ను దేశీయ విపణిలో ఆవిష్కరించనుంది. నవంబర్ మొదటి వారం నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) ఐఫోన్5 ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ఔత్సాహికులు ముందస్తుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 16జీబి వర్షన్ మోడల్‌కు మాత్రమే ప్రీబుకింగ్‌ అనుమతిస్తుంది. బుక్ చేసుకున్న రెండు, మూడు రోజుల్లో డెలివరీ ఉంటుంది. లింక్ అడ్రస్:

సాహోలిక్ డాట్ కామ్: స్పైస్ గ్రూప్స్‌లో భాగమైన సాహోలిక్ డాట్ కామ్ ఐఫోన్ 5 ఫ్రీఆర్డర్‌లను ఆహ్వానిస్తోంది. 16జీబి వేరియంట్ ధర రూ.45,500, నవంబర్ 4 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. లింక్ అడ్రస్:

రెడింగ్‌టన్(Redington): ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ రెడింగ్‌టన్ ఐఫోన్5.. 16జీబి, 32జీబి, 64జీబి వేరియంట్ ధరలను రూ. 45,500, 52,500, 59,500గా పేర్కొంది. నవంబర్ 2నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. లింక్ అడ్రస్:

షాప్ యువర్ వరల్డ్ డాట్ కామ్ (ShopYourWorld.com): ప్రముఖ రిటైలర్ షాప్ యువర్ వరల్డ్ డాట్ కామ్ ఐఫోన్5.. 16జీబి వేరియంట్ ను రూ.54,900కు ఆఫర్ చేస్తోంది.

ఇతర డీల్స్: ఐఫోన్5కు సంబంధించిన మరిన్ని డీల్స్ ను goProbo.com ద్వారా తెలుసుకోవచ్చు. లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X