Home
News

వాట్సాప్‌లో ఎన్ని ప్రైవసీ ఫీచర్‌లు ఉన్నాయో తెలుసా.. ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?

వాట్సాప్‌ ప్రస్తుతం ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లున్నారు. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాంగా ఉంది. రీల్స్‌ సహా ఫోటోలు, వీడియోల షేరింగ్ కోసం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అనేక ప్రత్యేక ప్రైవసీ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

వాట్సాప్‌ (Whatsapp Privacy Features) తన యూజర్ల భద్రత, ప్రైవసీ కోసం అనేక ఫీచర్‌లను తీసుకొచ్చింది. దీంతోపాటు వాట్సాప్‌ ను సౌకర్యవంతంగా ఉపయోగించుకొనేందుకు వీలుగా ఇతర అప్‌డేట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు అందిస్తోంది. అయితే చాలా వరకు ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌లు మీ ప్రైవసీని మెరుగుపరుస్తాయి.

top privacy features on whatsapp

చాట్‌ లాక్‌ ఫీచర్‌ :
ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ యూజర్లు ముఖ్యమైన చాట్స్‌ ను లాక్‌ చేసుకోవచ్చు. ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ ఐడీ ద్వారా మాత్రమే లాక్‌ చేసిన చాట్స్‌ను తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు లాక్‌ చేయాలనుకుంటున్న చాట్‌ ను Long Press చేయాలి. అక్కడ కనిపించిన Lock Chat ఆప్షన్ పైన క్లిక్‌ చేసి యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

వ్యూ ఒన్స్ :
View Once ఫీచర్‌ ద్వారా ఇతరులకు మీరు పంపే మెసేజ్‌లు, ఫోటోలు, వీడియో, ఆడియోనూ అవతలి వ్యక్తులు ఒకసారి మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం ఆటోమేటిక్‌ గా డిలిట్‌ కానుంది. ఈ ఫీచర్‌ మీ ప్రైవసీని మెరుగుపరుస్తుంది.

top privacy features on whatsapp

ఎడిట్‌ మెసెజ్‌ :
ఇతరులకు మెసేజ్‌ చేస్తున్న సమయాల్లో కొన్నిసార్లు పదాల్లో తప్పులు ఉండవచ్చు. వాట్సాప్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న Edit ఆప్షన్ ద్వారా మెసేజ్‌ పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లకు కూడా ఆ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

మెసెజ్‌లను ఎడిట్‌ చేశాక.. వాటికి ఎడిట్‌ ట్యాగ్‌ (Edited) కనిపిస్తుంది. వ్యక్తిగత లేదా గ్రూప్‌ చాట్‌ లో మీరు పంపిన మెసేజ్‌లలో తప్పులను గుర్తిస్తే.. ఆ మెసెజ్‌ను ఎడిట్‌ ఆప్షన్ ద్వారా సరిదిద్దవచ్చు. ఇందుకోసం ఆ మెసేజ్‌ను Long Press చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు Edit అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

మరో ఆకట్టుకొనే ఫీచర్‌ :
వాట్సాప్‌లో ప్రస్తుతం మీ వాట్సాప్‌ నంబర్‌కు మీరే మెసేజ్‌ చేసుకోవచ్చు. మీకు అవసరం అయిన సమయాల్లో ముఖ్యమైన పాయింట్స్‌ను నోట్‌ చేసుకోవచ్చు. లేదా ఫోటోలు, వీడియోలు, ఇతర లింక్స్‌ దాచుకొనేందుకు అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే పర్సనల్‌ నోట్‌ప్యాడ్‌ గా ఉపయోగించుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అనేక ప్రైవసీ ఫీచర్‌లు ఉన్నాయి. మీకు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌ చూసే అలవాటు ఉంటే, స్వీయ నియంత్రణ కోసం రోజువారి టైమ్‌ లిమిట్‌ ను పెట్టుకోవచ్చు. ఇందుకోసం ప్రొఫైల్‌ లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ కనిపించే టైం మేనేజ్‌మెంట్‌ పైన క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత డైలీ టైమ్‌ లిమిట్‌ కనిపిస్తుంది. 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు లిమిట్ పెట్టుకోవచ్చు. దీంతోపాటు అవసరం లేని మెసేజ్‌ రిక్వస్ట్‌లను Hide చేసుకొనేందుకు కూడా అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
top privacy features on whatsapp here is the guide to activate here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X