లక్షల కోట్లకు అధిపతులు, విలాసాల వీరులు వీరే
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న టెక్ దిగ్గజాల గురించి తెలుసా...ఎవరు ఎవర్నీ వెనక్కి నెట్టారో తెలుసా..
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న టెక్ దిగ్గజాల గురించి తెలుసా...ఎవరు ఎవర్నీ వెనక్కి నెట్టారో తెలుసా..తెలీకుంటే మీరు ఫోర్బ్స్ ఇండియా 2017 టెక్ లిస్ట్ చూడాల్సిందే. డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న టాప్ టెక్ బిలియనీర్స్ సంపద రోజురోజుకు పెరిగిపోతుందే కాని తరగడం లేదు. వీరి సంపద మొత్తం రూ. 47, 900 కోట్ల డాలర్లు...టాప్ టెక్ బిలియనీర్లపై ఓ లుక్కేయండి.

ముఖేష్ అంబాని
జియోతో దేశంలో ప్రకంపనలు పుట్టించిన ఈ టెక్ మేధావి నికర ఆస్తుల విలువ రూ. రెండు లక్షల కోట్లు.

అజీమ్ ప్రేమ్ జీ
సాఫ్ట్‌వేర్ రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తూ పోతున్న విప్రో ఛైర్మెన్. 72 సంవత్సరాల ఈ అపర మేధావి నికర ఆస్తుల విలువ సుమారుగా రూ. 1,20,000 కోట్లని అంచనా

శివనాడార్
టాప్ టెన్ టెక్ బిలియనీర్స్ జాబితాలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు షివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు.ఫోర్బ్స్ భారతీయ బిలియనీర్ల లిస్టులో ఏడవ స్థానంలో ఉన్నశివనాడార్ నికర ఆస్తులు రూ రూ.75,000 కోట్ల పైమాటే.

సునిల్ మిట్టల్
జియో రాకముందు దేశ టెలికం రంగంలో పెను విప్లవాలు నమోదు చేసిన భారతి ఎయిర్ టెల్ అధినేత. ఈ టెల్కో దిగ్గజం నికర ఆస్తులు సుమారు రూ. 54 వేల కోట్లని అంచనా

అనిల్ అంబాని
రిలయన్స్ కమ్యూనికేషన్ తో దేశాన్ని ఊపేస్తున్న ఈ అపర మేధావి నికర ఆస్తులు రూ. 20 వేల కోట్లు.

నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ అనే దిగ్గజ సంస్థని దేశానికి పరిచయం చేసిన ఈ దిగ్గజం నికర ఆస్తుల విలువ రూ. 1.5 బిలియన్ డాలర్లు.


Click it and Unblock the Notifications








