ఇండియాలో విడుదల అవుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే ....

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ కంపెనీలు మోటరోలా, ఒప్పో మరియు షియోమి వంటివి వచ్చే వారంలో ఇండియాలో కొత్త ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అధికంగా బడ్జెట్, మిడ్-రేంజ్ ధరల విభాగాలలో ఉండడం మరొక గొప్ప విషయం.

ఇండియాలో లాంచ్ అవుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో లాంచ్ అవుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా సంస్థ దేశంలో లాంచ్ చేయబోయే తన ఫోన్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ ఒప్పో సంస్థ ఒప్పో A53 2020 మరియు షియోమి సంస్థ రెడ్‌మి 9 లను లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే ధృవీకరించాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ డేట్

ఇండియాలో రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ డేట్

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లో అధిక వాటాను కలిగి ఉన్న షియోమి సంస్థ ఇప్పుడు కొత్తగా రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌తో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆగస్టు 27 న లాంచ్ చేయనున్నారు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉన్న రెడ్‌మి 9 ఫోన్ ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 12 ద్వారా రన్ అవుతుంది. ఇది జూన్‌లో స్పెయిన్‌లో లాంచ్ అయిన రెడ్‌మి 9 గ్లోబల్ వేరియంట్‌కు భిన్నమైన మోడల్ కావచ్చు అని అనుమానాలు కూడా ఉన్నాయి.

 

Also Read:Realme స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేసే గొప్ప అవకాశం!!!Also Read:Realme స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేసే గొప్ప అవకాశం!!!

Oppo A53 2020 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ డేట్

Oppo A53 2020 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ డేట్

ఒప్పో సంస్థ ఇప్పుడు కొత్తగా ఒప్పో A53 2020 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నది. రూ.15,000 ధర విభాగంలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25 న వర్చువల్ ఈవెంట్‌ ద్వారా లాంచ్ అవుతుంది. ఒప్పో A53 2020 యొక్క లాంచ్ టీజర్ ప్రకారం ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు హోల్-పంచ్ డిస్ప్లే మరియు గ్రేడియంట్ బ్యాక్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా జాబితా చేయబడింది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్ మరియు ఫ్యాన్సీ బ్లూ వంటి రెండు విభిన్న కలర్ ఎంపికలలో వస్తుంది.

ఒప్పో A53 2020 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

ఒప్పో A53 2020 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

ఒప్పో A53 2020 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 SoC చేత రన్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఇండియాలో Gionee Max స్మార్ట్‌ఫోన్ లాంచ్

ఇండియాలో Gionee Max స్మార్ట్‌ఫోన్ లాంచ్

జియోనీ సంస్థ నుండి వస్తున్న కొత్త ఫోన్ జియోనీ మాక్స్‌ను ఇండియాలో ఆగస్టు 25 న విడుదల చేయనున్నారు. భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మళ్ళి చాలా రోజుల తరువాత తిరిగి అడుగుపెడుతోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,000 ధర విభాగంలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ యొక్క టీజర్ ప్రకారం జియోనీ మాక్స్ వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్‌తో స్క్రీన్ చుట్టూ మందపాటి బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది.

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్

వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతున్న ఫోన్‌ల జాబితాలో చివరిది మోటరోలా సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్. ఇది ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ ను విడుదల చేసింది. టీజర్ ప్రకారం ఇది వెనుకభాగంలో మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు USB టైప్-C పోర్టును కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో విడుదలైన టీజర్ ప్రకారం కొత్త మోటరోలా ఫోన్‌ గురించి ఎటువంటి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఏదేమైనా ఇది స్నాప్‌డ్రాగన్ 450 SoC, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Top Smartphone Brands Launching New Phones in India Next Week

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X