Home
News

మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉత్తమమైనవి

ఇండియాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణి చివరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శామ్‌సంగ్ నుండి షియోమి వరకు ఇండియాలోని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఈ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్‌లను విడుదల చేశాయి. రియల్‌మి కూడా తన సరికొత్త రియల్‌మిX ఫోన్ తో ఈ బ్యాండ్‌వాగన్ విభాగంలోకి చేరింది.

top smartphones under rs 20 000

శామ్‌సంగ్ ఇప్పటికే ఈ విభాగంలో గెలాక్సీM మరియు గెలాక్సీA ఫోన్‌ల శ్రేణిని అందిస్తుంది.వినియోగదారులు 20,000 రూపాయల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే మెరుగైన నాణ్యత మరియు పెద్ద డిస్ప్లేలు, మెరుగైన కెమెరాలు (48 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో) మరియు మరింత స్థిరమైన ప్రాసెసర్‌లను అందిస్తున్న మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలిద్దాం.

రియల్‌మి X :

రియల్‌మి X :

రియల్‌మిX స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి సంస్థ నుండి వచ్చిన మొదటి మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ . దీని యొక్క ధర 16,999 రూపాయలతో ప్రారంభం అవుతుంది. రియల్‌మిX ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పాప్-అప్ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఇది 6.53-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. రియల్‌మి X స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుకవైపు 48-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా స్పెక్స్ ఉన్నాయి. అంతే కాకుండా సెల్ఫీస్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ మాడ్యూల్ కెమెరా ఉంది . దీని యొక్క పనితీరు మెరుగ్గా ఉండడం కోసం రియల్‌మిX స్మార్ట్‌ఫోన్‌ 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ మరియు 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో గల రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 710AIE పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఫోన్ యొక్క టాప్-ఎండ్ మోడల్ మరియు స్పెషల్ వేరియంట్ ధర 19,999 రూపాయలు.

శామ్సంగ్ గెలాక్సీ M40:

శామ్సంగ్ గెలాక్సీ M40:

ఇండియాలో రూ .20,000 లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్లలో శామ్సంగ్ గెలాక్సీ M40 ఒకటి. గెలాక్సీ S10 యొక్క ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేను కలిగి ఉన్న శామ్‌సంగ్ గెలాక్సీM40 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 9 Pie- ఆధారిత OneUI తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం శామ్సంగ్ గెలాక్సీ M40 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను 32 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీM40 స్మార్ట్‌ఫోన్‌ 19,990 రూపాయలకు లభిస్తుంది.

వివోZ1 ప్రో:

వివోZ1 ప్రో:

వివో సంస్థ చివరకు వివోZ1 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో మంచి దృడమైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది. ఇది 14,990 రూపాయల ప్రారంభ ధర వద్ద ఆన్‌లైన్‌లో లభిస్తుంది. వివో జెడ్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల FHD+ డిస్‌ప్లేను మరియు ముందు భాగంలో గెలాక్సీS10 యొక్క ప్రేరిత పంచ్-హోల్ కెమెరాతో అందిస్తుంది. తాజా వివో స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో జత చేసిన స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ఉన్న వివో జెడ్ 1 ప్రో యొక్క టాప్ ఎండ్ మోడల్ ధర 16,990 రూపాయలు.

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో:

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో:

ఇండియాలో షియోమి యొక్క రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 48 మెగాపిక్సెల్ కెమెరా (సోనీ IMX586 సెన్సార్) గల అత్యంత సరసమైన ఫోన్‌లలో ఇది ఒకటి. ఇది 13,999 రూపాయల ప్రారంభ ధర వద్ద ఆన్‌లైన్‌లో లభిస్తుంది. షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.3 అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పాత రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్ల మాదిరిగా కాకుండా గ్రేడియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ను అందిస్తుంది. ఇది 4GB / 6GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్ తో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మి నోట్ 7 ప్రోలో వెనుక వైపు 48 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు సెల్ఫీస్ కోసం ముందు వైపు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రెడ్‌మిK20:

రెడ్‌మిK20:

ఇప్పుడు పరిగణలో ఉన్న ధరకు 2,000 రూపాయలు అదనంగా చెల్లించగలిగితే మీరు షియోమి యొక్క రెడ్‌మిK20 ను పొందవచ్చు. ఈ ఫోన్ సరిగ్గా ప్రో వేరియంట్ లాగా కనిపిస్తుంది కాని కొన్ని సూక్ష్మమైన తేడాలతో వస్తుంది. రెడ్‌మిK20 స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కానీ ప్రో మోడల్ మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అందిస్తుంది. షియోమి రెడ్‌మిK 20 ఇండియాలో 21,999 రూపాయల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. షియోమి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు ఇఎంఐ లావాదేవీలపై 1,000 రూపాయల తగ్గింపు ఆఫర్ ఇస్తోంది. రెడ్‌మిk20 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లో 6.39-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 48 MP మరియు 8 MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 20 MP పాప్-అప్ సెల్ఫీ కెమెరా, 6 జిబి ర్యామ్ మరియు 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
top smartphones under rs 20 000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X