Home
News

Air Cooler ఎయిర్‌ కూలర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..!

వేసవి కాలంలో తక్కువ ధరలో చల్లదనం పొందేందుకు ఎక్కువ మంది ఎయిర్‌ కూలర్లను (Air Cooler) కొనుగోలు చేస్తారు. ధర తక్కువ సహా నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉండడం, సులభంగా ఇంటాబయటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉండడంతో అధిక శాతం ప్రజలు ఎయిర్‌ కూలర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కూలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మీకు తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండే ఎయిర్‌ కూలర్లు (Types of Air Coolers) నాలుగు రకాలుగా ఉన్నాయి. పర్సనల్‌ కూలర్లు, టవర్‌ కూలర్లు, విండో కూలర్లు, డిజర్ట్‌ కూలర్లు.. అయితే అవసరం మరియు వినియోగం, ప్రాంతం ఆధారంగా ఈ కూలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

top things to know before buying air cooler

పర్సనల్ కూలర్లు : ముఖ్యంగా ఈ ఎయిర్‌ కూలర్లు చిన్న గదుల్లో వినియోగానికి రూపొందించినవి. వీటిని అవసరం అయిన ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ వ్యక్తిగత కూలర్లు శుభ్రమైన, స్వచ్చమైన గాలిని అందిస్తాయి. వ్యక్తిగత అవసరాలకు ఈ కూలర్లు అనువుగా ఉంటాయి.

టవర్‌ కూలర్లు : తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాన్ని చల్లగా మార్చాలంటే ఈ టవర్‌ కూలర్‌ కొనుగోలు చేయాలి. మిడిల్‌ సైజ్‌ గదుల కోసం ఈ టవర్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు, ఈ కూలర్‌ కూడా ఒక చోట నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది.

top things to know before buying air cooler

విండో కూలర్లు : కొంచెం పెద్ద గదుల కోసం ఈ కూలర్లను కొనుగోలు చేయవచ్చు. గదిలో ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉంచేందుకు ఈ కూలర్లు అనువుగా ఉంటాయి. ఈ విండో కూలర్ బాడీ గది బయట ఉంటుంది. ఫ్యాన్‌ మాత్రమే గది లోపల ఉంటుంది.

డిజర్ట్‌ కూలర్లు : పెద్ద గదుల్లో నలుగురు కంటే ఎక్కువ మంది కోసం కావాల్సి వస్తే మాత్రం డిజర్ట్ కూలర్ల వైపు మొగ్గు చూపవచ్చు. ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ హుమిడిటీ ఉండే ప్రాంతాల ప్రజలు ఈ కూలర్ల వైపు మొగ్గు చూపవచ్చు. నీటిని వేగంగా ఆవిరిగా మార్చి ఉపసమనం కలిగిస్తాయి.

top things to know before buying air cooler

ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల కూలింగ్‌ ప్యాడ్‌లతో కూలర్‌లు అందుబాటులో ఉన్నాయి. యాస్పెన్‌ ప్యాడ్‌, హనీ ప్యాడ్‌.. యాస్పెన్‌ ప్యాడ్‌ కూలర్లు కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే హానీ ప్యాడ్‌ కూలర్లు కొంచెం అధిక ధరను కలిగి ఉంటాయి. తక్కువ సమయంలో ఇవి గదిని చల్లబరుస్తాయి.

దీంతోపాటు కూలర్లను కొనుగోలు చేసే సమయంలో వాటి నీటి సామర్థ్యం కూడా తనిఖీ చేసి కొనుగోలు చేయాలి. చిన్న గదులకు 20 లీటర్ల సామర్థ్యం, అదే పెద్ద గదులకు 30 నుంచి 40 లీటర్ల సామర్థ్యం కలిగిన కూలర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు చక్రాలు కలిగిన కూలర్లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఒకచోటు నుంచి వేరే చోటుకు సులభంగా తీసుకెళ్లవచ్చు.

కూలర్లు కొనుగోలు చేసే సమయంలో రిమోట్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ ఉన్నవి ఎంచుకోవాలి. దీంతోపాటు ఐస్‌ ఛాంబర్‌ ఉన్న కూలర్లను కొనుగోలు చేయడం ద్వారా గదిని వేగంగా చల్లబరచవచ్చు. దీంతోపాటు డస్ట్‌ ఫిల్టర్‌ ఉన్న కూలర్లను కొనుగోలు చేయడం ఉత్తమం. సౌండ్‌ తక్కువగా వచ్చే కూలర్లను ఎంచుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
top things to know before buying air cooler
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X