ప్రపంచంలో ఉన్న టాప్ లీడర్స్ కోసం 'టాప్ కామ్'

By Super
|
ప్రపంచంలో ఉన్న టాప్ లీడర్స్ కోసం 'టాప్ కామ్'


సోషల్ నెట్ వర్క్ రోజు రోజుకీ మారుతున్న ప్రపంచంలో కొత్త పుంతలను తొక్కుతుంది. ఇందుకు నిదర్శనం భారతీయ వ్యాపారవేత్త 'వివేక్ రానాదివే' రూపొందించని కొత్త సోషల్ నెట్ వర్క్ 'టాప్ కామ్'. ప్రపంచంలో ఉన్న లీడర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది 'టాప్ కామ్' అనే సోషల్ నెట్ వర్క్. ఈ సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్, స్కైపీ, ఈ మెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల కలయికే 'టాప్ కామ్'.

 

ప్రపంచంలో ఉన్న అత్యధిక ధనికులను దృష్టిలో పెట్టుకోని రూపొందించిన ఈ సోషల్ నెట్ వర్క్ ఈ వారంలో జరగనున్న 'వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్'లో అధికారకంగా విడుదల చేయనున్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్ తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపార ప్రజల దృష్టిని పట్టుకోడానికేనని పలువులు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ వ్యాపారవేత్త 'వివేక్ రానాదివే' టాప్ కామ్ వెబ్ సైట్‌ని టిబ్‌కో సాప్ట్‌వేర్‌ని ఉపయోగించి డవలప్ చేశామని, ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన నాయకులు, 200 లీడర్స్ ఒకే సోషల్ నెట్ వర్క్ క్రింద ఉండాలనేది తన అభిప్రాయంగా తెలిపారు. కొన్ని దేశాలలో ఎప్పుడైనా భూకంపం వంటి సహజ గొప్ప విపత్తులు సంభవిస్తే వాటికి సంబంధించిన వీడియోలు, మేసెజ్‌లను ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం ద్వారా మిగిలిన దేశాల నుండి త్వరగా సహాయం అందుతుందని అన్నారు.

గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఈ వెబ్‌సైట్‌ని ఎవరైనా హ్యాకర్లు హ్యాక్ చేస్తే పెద్ద సిరియస్‌గా భావిచండమే కాకుండా, హ్యాకైన సందర్బంలో రెడ్ సిగ్నల్ వస్తుందన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలో ఉన్న నాయకులు సమాచార పరంగా సోషల్ నెట్ వర్క్‌ని ఉపయోగిస్తున్నారు. ఐతే కొన్ని సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్స్ హ్యాకింగ్‌కి గురై వారికి ఇబ్బందులను గురి చేస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్ ‌బుక్ ఖాతాల నిజానికి వారి సిబ్బంది చేత నిర్వహించబడుతున్నాయని అన్నారు. దీంతో వారు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎకౌంట్స్‌ని అప్ డేట్ చేస్తున్నారు. ఇలాంటి వాటన్నింటి నుండి కూడా వారికి విముక్తిని కలిగిస్తూ.. టాప్ కామ్ అనే కొత్త సోషల్ నెట్ వర్క్‌ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X