ఓలా,ఉబెర్‌తో విసిగిపోయారా,టోరా క్యాబ్స్ బుక్ చేసుకోండి

|

రైడ్ హైరింగ్ సర్వీసుల్లోకి మరో కొత్త యాప్ ఆధారిత సంస్థ టోరా క్యాబ్స్‌‌ నగరంలోకి ప్రవేశించింది. క్యాబ్‌ సర్వీసు సంస్థలు ఓలా, ఉబెర్‌తో విసిగిపోయిన హైదరాబాద్‌ వాసులకు శుభవార్తను అందిస్తూ టోరా క్యాబ్స్‌ దూసుకువచ్చాయి. కొరియా సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన టోరా క్యాబ్స్‌ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ అనే సంస్థ దేశీయంగా క్యాబ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది.

Tora Cabs launches ride-hailing service in Hyderabad

ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రధానంగా డిమాండ్‌ను బట్టి చార్జీలు, సర్‌ చార్జీలు బాదేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్న ప్రధాన క్యాబ్‌ సర్వీసులకు షాకిచ్చేలా టోరా క్యాబ్స్ తెలంగాణా రాజధానిలోకి ఎంట్రీ ఇచ్చింది.

జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్‌

జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్‌

జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్‌' లక్ష్యమని టోరా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ క్యాబ్‌ డ్రైవర్లు వినియోగదార్ల నుంచి వసూలు చేసే మొత్తంలో తాము ఎటువంటి కమీషన్‌ తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు. యాప్‌ ఆధారిత సర్వీసు ద్వారా పారదర్శక బిజినెస్‌తో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఇద్దరికీ ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది. జూన్‌ 12న పైలట్ వెర్షన్‌గా సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్‌ వచ్చే 45 రోజుల్లో పూర్తి సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రోజు వారీ చందా

రోజు వారీ చందా

టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌‌పీఎల్) డ్రైవర్లు కేవలం రోజువారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.199, వారానికి రూ. 1194, నెలకు రూ.4975గా నిర్ణయించింది. ఇది మినహా ఎలాంటి కమిషన్లు తీసుకోదు. దీనివల్ల క్యాబ్‌ డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం ఉంటుందని అన్నారు. అధిక డిమాండ్‌ ఉన్న సమయంలో అధిక ఛార్జీలు వసూలు చేసే విధానానికి కూడా తాము వ్యతిరేకమని టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్‌ వివరించారు.

1500 మంది క్యాబ్‌ డ్రైవర్లు

1500 మంది క్యాబ్‌ డ్రైవర్లు

కొరియన్ సంస‍్థ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని టోరా క్యాబ్స్‌ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. ఈ కొత్త పద్ధతుల ద్వారా క్యాబ్‌ సేవల రంగంలో మార్పులు తీసుకురావాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించిన తమకు ఇప్పటికే 1500 మంది క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నట్లు, మరో 45 రోజుల్లో ఈ సంఖ్య 4 వేలకు చేరుతుందని టోరా క్యాబ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు.ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతమైన, ప్రయోజనం కల్గించే విధానాన్ని టోరా ప్రవేశపెడుతోందని అన్నారు.

 రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌

రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌

కంపెనీ నుంచి డ్రైవర్లు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ను పొందుతారు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌‌‌‌ఛార్జ్‌‌ను వసూలు చేయమని మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌‌‌‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని కవితా భాస్కరన్‌ పేర్కొన్నారు. టోరాక్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌‌పీఎల్) కింద దీని సేవలు ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యాయి. మరో 45 రోజుల్లో తన సేవలను పూర్తిగా వినియోగదారుల ముందుకురానున్నాయి.

 ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ అవకాశాలు

తొలుత టోరా క్యాబ్స్ తన సేవలను హైదరాబాద్‌‌లోనే ప్రారంభించింది. ఆ తర్వాత మెట్రోలు, నాన్ మెట్రోల్లోకి ప్రవేశించనున్నామని తెలిపారు. ఇంటర్‌‌‌‌సిటీ, ఇంట్రా సిటీ రెండు రకాలైన సేవలను టోరా క్యాబ్స్ ద్వారా అందించనున్నట్టు చెప్పారు. డ్రైవర్లపై తాము ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం టోరా క్యాబ్స్ వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. టెక్నాలజీపై ఇది ఎక్కువగా ఇన్వెస్ట్‌‌మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వారి టెక్నాలజీ బేస్ హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నట్టు చెప్పింది. టోరా సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఢిల్లీలోనే ఉంది

Best Mobiles in India

English summary
Tora Cabs launches ride-hailing service in Hyderabad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X